ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఈనెల 25 నాటికి వెలిగొండ హెడ్​ రెగ్యులేటర్​ పనులు పూర్తి చేస్తాం'

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాదిలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తామని జలవనరుల మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ స్పష్టం చేశారు. ఆయన శ్రీశైలం నుంచి బోటులో వెళ్లి వెలిగొండను సందర్శించారు. ఆయన వెంట మంత్రి సురేష్​, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం సహా పునరావాస ప్యాకేజీని ఇస్తామని అన్నారు.

'ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం'
'ఈ ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తాం'

By

Published : Jun 1, 2020, 3:37 PM IST

Updated : Jun 1, 2020, 7:24 PM IST

వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ పనులను ఈనెల 25 లోపు పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, నంద్యాల ఎంపీ పోచబ్రహ్మానందరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డితో కలిసి మంత్రి ప్రాజెక్టు పనులు పరిశీలించారు. శ్రీశైలం నుంచి బోటులో వెళ్లి వెలిగొండను సందర్శించారు. ప్రాజెక్టు పనుల వివరాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు.

మొదటి టన్నెల్​ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి అక్టోబర్ నెల నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి అనిల్ తెలిపారు. రెండో టన్నెల్​ను మరో ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ నుంచి దాదాపు 1.18 లక్షల ఆయకట్టుకు నీళ్లిస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడం సహా పునరావాస ప్యాకేజీని ఇస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది కాలంలో 90 శాతం మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేశారని మంత్రి చెప్పారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి..

విజయవాడ నుంచి భువనేశ్వర్​కు ప్రత్యేక రైలు

Last Updated : Jun 1, 2020, 7:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details