'వేడుకలకు దూరంగా ఉందాం.. రైతులకు అండగా నిలుద్దాం' - chandrababu tweet
తెదేపా అధినేత చంద్రబాబు.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. పార్టీ శ్రేణులనూ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలపాలన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు.. ఆయన ట్వీట్ చేశారు. వేడుకలకు దూరంగా ఉండి.. అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలపాలని తెదేపా నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వేడుకలకయ్యే ఖర్చులను రైతులకోసం పోరాడే అమరావతి పరిరక్షణ సమితి ఐకాసలకు విరాళంగా ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతి పరిరక్షణ రాష్ట్రంలో అందరి సంకల్పం కావాలని ఆకాంక్షించారు. అందరూ ఆనందంగా ఉన్నప్పుడే బాగుంటుందని.. ఇప్పుడు రైతులు ఆనందంగా లేరని చెప్పారు. అందుకే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.