- సీపీఎస్ రద్దు హామీ తొందరపాటన్న బొత్స.. జీపీఎస్ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగులు
ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్‌లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గాంధీపై దాడి జరిగితే స్పందించలేదేం?
కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేసినా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెదేపా లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సరైన రీతిలో స్పందించలేదని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెన్నుపాటి గాంధీపై దాడి కేసు.. రిమాండ్ రిపోర్ట్ తిప్పిపంపిన కోర్టు
తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టు తిప్పిపంపింది. 326 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దానికి గల కారణాలను కోర్టులో సమర్పించలేకపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం
కస్టోడియల్ టార్చర్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. రెండున్నరేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అంటున్న నీతీశ్..
ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో దిల్లీ పర్యటనకు వెళ్లిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్ కుమార్ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయిన నీతీశ్.. ఎప్పుడైనా అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ అవుతుందని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్ జోడో యాత్ర షురూ.. రాహుల్ నేతృత్వంలో దేశమంతా..