- తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీ ఉద్రిక్తం
తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్టు చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అసెంబ్లీ పరిసరాల బయట ఉద్రిక్తత నెలకొంది. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్ నిరసన ర్యాలీ చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రుణ యాప్‌లు వేధిస్తున్నాయా.?.. అయితే ఈ సెక్షన్స్ గురించి తెలుసుకోండి..
ఒక్కసారి అప్పు తీసుకుని, వడ్డీ సహా మొత్తం రుణం తీర్చేసినా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ వేధింపులు... మార్ఫింగ్ చిత్రాలతో మానసిక క్షోభకు గురిచేసేంతగా అకృత్యాలు.. అప్పు తీరుస్తావా? లేదంటే పరువు తీసేయాలా? అనే బెదిరింపులు.. ఇలా ఒకటేమిటి ఆన్‌లైన్ రుణయాప్‌ల నిర్వాహకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. వీరి బారిన పడి పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య
పల్నాడు జిల్లాలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మహిళను హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వేలిముద్రల చోరీతో నగదు లూటీ
బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రలను చోరీచేసి వారి ఖాతాల్లోని నగదును అత్యంత సునాయాసంగా మాయం చేస్తున్న ఉదంతాలు విశాఖ నగరంలో వెలుగుచూస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం బాధితులకు చెందిన రూ.1.50కోట్లకు పైగా నగదును వారి ఖాతాల నుంచి దర్జాగా ఉపసంహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,858 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 18 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,735 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత సైన్యం సరికొత్త రణనీతి.. అరుణాచల్‌లో శత్రువులకు చెక్!