ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఏపీ న్యూస్

.

ప్రధాన వార్తలు
ప్రధాన వార్తలు

By

Published : Mar 17, 2022, 10:59 AM IST

  • TDP Protest: జే బ్రాండ్‌తో సీఎం జగన్‌ జనాల ప్రాణాలు తీస్తున్నారు: తెదేపా
    ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేతలు మండిపడ్డారు. నాటుసారాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. దోచుకోవాలి, దాచుకోవాలి అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిసూ.. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. నాటుసారా మరణాలపై ఉభయసభల్లో చర్చించేదాకా ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
    ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను దూషించారంటూ ఒంగోలు మేయర్‌.. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దర్శి సామాజిక వైద్యశాలలో నగదు గోల్‌మాల్​... ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా..
    దర్శి సామాజిక వైద్యశాల ప్రభుత్వ ఉద్యోగుల పొదుపు ఖాతాల్లో నగదు గోల్‌మాలైంది. 2018 నుంచి ఇప్పటివరకు పొదుపు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. పొదుపు ఖాతా నుంచి రుణం కోసం ఓ ఉద్యోగి దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • తణుకులో బాండ్ల జారీలో నిర్లక్ష్యం... ముగ్గురు అధికారులపై వేటు
    తణుకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ సూపర్​వైజర్​లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. టీడీఆర్​ బాండ్ల జారీలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్ చేస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రూ.3,600 కోట్ల కుంభకోణంలో రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై ఛార్జిషీటు
    రూ.3,600 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగస్టా వెస్ట్​ల్యాండ్ కేసులో రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై సీబీఐ ఛార్జ్​షీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం
    ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. నిందితుడి వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Ukraine Crisis: రష్యా 'ఛాంబర్‌'లో కాలకూటాల అభివృద్ధి
    రష్యా రాజధాని మాస్కో శివార్లలో సైంటిఫిక్‌ రిసెర్చ్​ ఇన్‌స్టిట్యూట్‌ నెం.2 భవనం ఉంది. కేజీబీ మాజీ అధికారులు, రష్యా నుంచి పారిపోయిన సీనియర్‌ గవర్నమెంట్‌ అధికారులు ఆ భవనం గురించి భయంకరమైన కథను ప్రపంచానికి వెల్లడించారు. ఇది క్రెమ్లిన్‌ కాలకూట విషాల తయారీ ఫ్యాక్టరీ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెెక్స్ 1000 ప్లస్
    అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 1023 పాయింట్ల వృద్ధితో 57,850 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్​లోని అన్ని షేర్లు లాభాల్లోనే ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • జాక్వెలిన్​ గురించి ఆ ప్రశ్న.. ఆమె నచ్చదన్న అక్షయ్!
    బాలీవుడ్ హాట్​ బ్యూటీ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ కన్నా నటి కృతి సనన్ అంటేనే తనకు ఇష్టమని చెప్పారు స్టార్ హీరో అక్షయ్ కుమార్. జాక్వెలిన్ గురించి అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో ఈ మేరకు సమాధానమిచ్చారు అక్షయ్. ఇంతకీ అదేంటంటే? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • IPL 2022: పేపర్​ మీద 'సూపర్​హిట్'​ టీమ్​.. మరి ఫీల్డ్​లో?
    కెప్టెన్‌.. వికెట్‌ కీపర్‌.. ఓపెనర్‌.. ఇలా మూడు రకాలుగా ఉపయోగపడే ఆటగాడు ఓ వైపు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో అదరగొట్టే ఆల్‌రౌండర్‌ మరోవైపు.. మణికట్టుతో మాయ చేస్తున్న స్పిన్నర్‌ ఇంకోవైపు.. ఇలా మెగా వేలానికి ముందే ముగ్గురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలిగే ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టి.. చేతిలో ఉన్న డబ్బునంతా వేలంలో ఖర్చు పెట్టి.. ఉత్తమ జట్టును సృష్టించుకున్న ఈ కొత్త ఫ్రాంఛైజీ.. తొలి సీజన్‌లోనే తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో ఉంది. మరి ఆ జట్టు ఎలా ఉందో ఓ సారి చూసేద్దాం పదండి! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details