ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'4లక్షల ఉద్యోగాలంటూ.. 10 లక్షల ఉద్యోగాలకు గండి'

ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నిర్ణయంతో అన్నక్యాంటీన్లలో పని చేస్తున్న సామాన్యులకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'

By

Published : Aug 6, 2019, 6:26 PM IST

రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్తూనే 10 లక్షల మంది ఉపాధికి గండి కొట్టారని తెదేపా జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ మండిపడ్డారు. జగన్‌ మోకాలి నిర్ణయాలతో పేదల నోటికి అందే కూడు పోవడమే కాకుండా అన్న క్యాంటీన్లలో పనిచేస్తున్న సామాన్యులకు ఉపాధి లేకుండా చేశారని దుయ్యబట్టారు. వైకాపా కార్యకర్తలపై ఉన్న ప్రేమ, సామాన్యులపై లేదా అని నిలదీశారు. భవిష్యత్తు ప్రశ్నార్థకమై రావాలి జగన్, కావాలి జగన్ అంటూ గోపాల మిత్రలు అర్ద నగ్నంగా రోడ్డెక్కుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. ఇలా చేస్తుంటే జగన్​కు చీమ కుట్టినట్లైనా లేదా అంటూ ప్రశ్నించారు. గోపాలమిత్రల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

'4లక్షల ఉద్యోగాలు అంటూ 10లక్షల ఉద్యోగాలకు గండి'

ABOUT THE AUTHOR

...view details