ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది' - తెలంగాణపై ఏపీ జలవనరులశాఖ కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని.. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ అన్నారు. 5 కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చేపట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా వాడుకున్న నీటి లెక్కల వివరాలను బోర్డుకు ఏపీ జలవనరుల శాఖ అధికారులు అందించారు.

ap irrigation officers comments on telangana govt about projects
ap irrigation officers comments on telangana govt about projects

By

Published : May 18, 2020, 8:04 PM IST

Updated : May 19, 2020, 4:43 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అతిక్రమించి ప్రాజెక్టులు చేపడుతోందని కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నీటి తరలింపు సామర్థ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దానిపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ ఇవ్వాలని కోరింది. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఎర్రమంజిలిలో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డు ఇన్​ఛార్జి ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఎదుట హాజరైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్‌, ఇఎన్‌సీ నారాయణరెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు.

  • అయిదు కొత్త ప్రాజెక్టులు చేపట్టారు

కృష్ణానదిపై అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు అందజేయడంతోపాటు వాటికి సంబంధించి కనీసం డీపీఆర్‌లు కూడా కేంద్రానికి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంటూ ఓ లేఖను బోర్డుకు అందజేశారు. మిగులు జలాలు ఉన్నాయంటూ...విభజన చట్టానికి వ్యతిరేకంగా అయిదు కొత్త ప్రాజెక్టులు తెలంగాణ చెప్పట్టిందని బోర్డుకు ఇచ్చిన లేఖలో స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులపై పలుమార్లు అపెక్స్ కౌన్సిల్, సీడబ్యుసీ, కేఆర్ఎంబీ దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని కూడా బోర్డు ఛైర్మన్​కు గుర్తు చేశారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిని డీపీఆర్‌లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరినా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని వివరించారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. అనుమతులు లేని ప్రాజెక్టులపై పలుమార్లు కృష్ణానది యాజమాన్య బోర్డు దృష్టికి తెచ్చినట్లు కూడా పేర్కొన్నారు.

  • పాలమూరు-రంగారెడ్డిలా పోతిరెడ్డిపాడు

ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం అనుమతి ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వారిగా వాడుకుంటున్న నీటి లెక్కలతో పాటు కొత్తగా చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు కేఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్‌ అయ్యర్‌కు అందజేసినట్లు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 881 అడుగుల నీటిమట్టం దగ్గర మాత్రమే నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉందని తెలిపారు. ఈ నీటిమట్టం వద్ద ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని వివరించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఇరు రాష్టాలకు నీటిని కేటాయింపుల్లో భాగంగానే తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మాదిరిగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం ఏపీ చేపడుతోందని వివరించారు.

ఇదీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఏపీ బృందం వివరణ

Last Updated : May 19, 2020, 4:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details