ఇంటర్ మూల్యాంకనంలో ఒక్కొక్కరికి 45 జవాబు పత్రాలు ఇస్తున్నారు. సాధారణంగా 30 పేపర్లు దిద్దాల్సి ఉండగా, త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రస్తుతం 45 పేపర్లు ఇస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకన సమయం ఉండగా, ప్రస్తుతం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు పని చేయిస్తున్నారు. కరోనా కారణంగా కేంద్రాలను వికేంద్రీకరణ చేశారు. వృత్తి విద్యా కోర్సుల పేపర్ల మూల్యాంకనంలో కొన్ని జిల్లాల వారికే అవకాశం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ అవకాశమివ్వాలని లెక్చరర్లు కోరుతున్నారు.
త్వరితగతిన ఇంటర్ మూల్యాంకనం..ఒక్కొక్కరికి 45 జవాబు పత్రాలు
ఇంటర్ మూల్యాంకనం తర్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా ఒక్కొక్కరూ 30 పేపర్లు దిద్దాల్సి ఉండగా... ఒక్కొక్కరికి 45 పేపర్లు ఇస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు పని చేయిస్తున్నారు.
ఇంటర్ మూల్యాంకనం