ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు - minister ranganath raju comments on housing sites news

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం వల్లే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉండడం వల్లే ప్రక్రియ నిలిపివేశామని అన్నారు. అవరోధాలను అధిగమించి ఆగస్టు 15 నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు
హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు

By

Published : Jul 7, 2020, 1:22 PM IST

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టు స్టే ఉండటం వల్లే వాయిదా వేయాల్సి వచ్చిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. ప్రధానంగా నాలుగు రిట్‌ పిటిషన్లకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని.. వాటి ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలిచ్చేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈనెల 8న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇప్పటికే 60 వేల ఎకరాలు సేకరించామని పేర్కొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్లారని.. ఇదే సమయంలో కొన్ని వందల రిట్‌ పిటిషన్లు దాఖలు చేయించారని మంత్రి శ్రీరంగనాథరాజు ఆరోపించారు. స్టేలు తొలగించాలని తాము సుప్రీంకోర్టులో సవాల్​ చేశామని.. సెలవుల వల్ల స్టేలు తొలగించే పరిస్థితి లేదని వెల్లడించారు. అవరోధాలను అధిగమించి ఆగస్టు 15 నాటికి పేదలకు ఇళ్లు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడ్డు పడేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న ఆయన.. చంద్రబాబు హయాంలో 2 లక్షల ఇళ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. తెదేపా హయాంలో హౌసింగ్​కు సంబంధించి మొత్తం రూ.4,300 కోట్లు బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details