ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సివిల్ జడ్జి నోటిఫికేషన్‌: 'న్యాయవాద అనుభవం అవసరం లేదు'

సివిల్ జడ్జి నోటిఫికేషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడేళ్ల న్యాయవాద అనుభవం అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సవరణతో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

AP High Court verdict on Civil Judge Notification
AP High Court verdict on Civil Judge Notification

By

Published : Mar 4, 2021, 4:28 PM IST

సివిల్ జడ్జి నోటిఫికేషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. సివిల్ జడ్జి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుభవం అవసరం లేదని తీర్పు చెప్పింది. మూడేళ్ల న్యాయవాద అనుభవం అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షలకు హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. అనుభవం అవసరం లేదని గతంలో సుప్రీం తీర్పు ఇచ్చిందని డివిజన్ బెంచ్ గుర్తుచేసింది.

ఇటీవల జరిపిన రాతపరీక్షను రద్దు చేస్తూ... ఉత్తర్వులిచ్చింది. సవరణతో మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని రిక్రూట్‌మెంట్‌ రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సివిల్ జడ్జి నియామక నోటిఫికేషన్‌పై హైకోర్టులో 50కి పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండీ... 'ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. స్టీల్​ప్లాంట్​ను అమ్మేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details