ప్రజాప్రతినిధుల లాక్డౌన్ ఉల్లంఘనలపై విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బి. కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా , సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరి పేట ఎమ్మెల్యే రజని లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది పారా కిశోర్ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లాక్డౌన్ ఉల్లంఘించారని న్యాయవాది వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.