నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన అరెస్ట్‌పై మరో మూడు వారాల పాటు తొందరపడవద్దని పోలీసులను ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు అరెస్ట్‌పై రెండు వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గత విచారణలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు మూడు వారాల పాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది .
ఏబీ వెంకటేశ్వరరావు కేసు: గత ఆదేశాలు మరో 3 వారాలు పొడిగింపు - latest news of senior ips officer ab venkateswara rao case
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన అరెస్ట్‌పై గత విచారణలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగించింది.
high court hearing on senior ips officer ab venkateswara rao anticipatory bail plea