ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, డివిజన్ బెంచ్ కి బదిలీ చేయాలని ఎస్ఈసీ న్యాయవాది కోరారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చని ధర్మాసనం తెలిపింది. ఇది ప్రజా ప్రయోజనాల కిందకి వస్తుందని గతంలో పలు జడ్జిమెంట్లు ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది వాదించారు. జడ్జిమెంట్లు ఫైల్ చేయాలని పిటిషనర్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 23కి ధర్మాసనం వాయిదా వేసింది.
కేసు ఏంటంటే..?
విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు.. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.