ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం... ఉత్తర్వులు జారీ

నూతన ఇసుక విధానం- 2019లో మార్పు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు జోన్ల వారిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేతృత్వంలో జరుగుతాయని పేర్కొంది. ఇక నుంచి ఆఫ్ లైన్ లోనే ఇసుక లభ్యత ఉంటుందని స్పష్టం చేసింది.

new sand policy 2020
new sand policy 2020

By

Published : Nov 13, 2020, 3:48 AM IST

Updated : Nov 13, 2020, 5:01 AM IST

ఆఫ్‌లైన్‌లోనే వినియోగదారులకు ఇసుకను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విధానం-2019 లో మార్పు చేర్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యతలు జోన్ల వారీగా..... కేంద్రప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు ఇచ్చారు.

వాల్టా చట్టానికి లోబడి ఇసుక తవ్వకాలు జరపాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. నాణ్యమైన ఇసుక కోసం ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. బ్యారేజీల వద్ద ఇసుక తవ్వకాల సమయంలో ఇరిగేషన్, గనుల శాఖల అనుమతులు తప్పనిసరని తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాల్లోని ఇసుక రీచుల నిర్వహణ గిరిజనులకే ఇవ్వాలన్న నిబంధనను పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.

3 ప్యాకేజీలుగా విభజన..

రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లను..3 ప్యాకేజీలుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ-1 పరిధిలో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను చేర్చింది. ప్యాకేజీ-2 పరిధిలో... పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకేజీ-3 పరిధిలోకి నెల్లూరు సహా నాలుగు రాయలసీమ జిల్లాలను కేటాయించారు. ప్యాకేజీల వారీగా... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు ముందుకు రాకుంటే బిడ్డింగ్ ద్వారా... 3 ప్యాకేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం సూచించింది. సాంకేతిక, వాణిజ్య బిడ్ల ద్వారా.. ప్రైవేటు సంస్థలను ఖరారు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి

గుంటూరు: కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగవంతం

Last Updated : Nov 13, 2020, 5:01 AM IST

ABOUT THE AUTHOR

...view details