నవరత్నాలు, పేదల ఇళ్ల పథకంపై ప్రభుత్వం మరిన్ని విధివిధానాలు జారీచేసింది. పట్టణాల్లో స్థలం అందుబాటులో ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించింది. పట్టణాల్లో స్థలం అందుబాటులో లేనిచోట్ల జీ ప్లస్ 3 విధానంలో ప్లాట్ల నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. లబ్ధిదారులకు జీవితంలో ఒక్కసారి మాత్రమే స్థలం కేటాయించాలని, లబ్ధిదారుల వివరాలు ఆధార్ లేక రేషన్ కార్డుకు లింక్ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రేషన్ కార్డు లేకపోయినా అర్హత ఉన్నవారికి స్థలం కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పేదలకు జీ ప్లస్ 3 ప్లాట్లు... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ - వైఎస్సార్ పేదల ఇళ్ల పథకం న్యూస్
నవరత్నాలు, పేదల ఇళ్ల పథకంపై ప్రభుత్వం విధివిధానాలు జారీచేసింది. పట్టణాల్లో స్థలం అందుబాటులో ఉంటే సెంటు స్థలం ఇచ్చేలా, స్థలం లేని యెడల జీ ప్లస్ 3 విధానంలో ప్లాట్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పేదలకు జీ ప్లస్ 3 ప్లాట్లు... ప్రభుత్వ ఉత్తర్వులు జారీ