పరిశ్రమలకు ఊరటనిచ్చేందుకు రీస్టార్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను పొందటానికి మార్గదర్శకాలు మంగళవారం విడుదలయ్యాయి. ప్రోత్సాహకాలను పొందడానికి ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు ఫిబ్రవరి వరకు పనిచేసే అన్ని పరిశ్రమలు రీస్టార్ట్ కింద ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట సీజన్లలో పనిచేసే యూనిట్లు, వాటి అనుబంధ యూనిట్లు సాయం పొందవచ్చు.
* www.apindustries.gov.in/incentives ’( ఆన్‌లైన్ పోర్టల్‌లో పారిశ్రామిక యూనిట్లు ఇప్పటికే వివరాలు నమోదు చేశాయి. వైబ్‌సైట్‌లోకి లాగిన్ కావడానికి ఇప్పటికే వ్యవస్థాపకులకు జారీ చేసిన కోడ్‌ను వాడాలి.
* ఇతర, కొత్త పరిశ్రమలు https:// www.apindustries.gov.in/APindus/UserInterface/ SingleWindow ServiceApplication/ LoginPortal/ Introduction.aspx లాగిన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి.
* భారీ, మెగా పరిశ్రమల విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ఛార్జీల చెల్లింపు వాయిదా వేయటానికి మాత్రమే సౌలభ్యం ఉంది. ఎంఎస్‌ఎంఈల గరిష్ఠ డిమాండ్ ఛార్జీలు పూర్తిగా మాఫీ అవుతాయి.
దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు.. ఇతర వివరాలు..
1. ఎంఎస్‌ఎంఈలు యూఏఎం ఈఎం పార్ట్-2 అక్నాలెడ్జ్‌మెంట్ జత చేయాలి. భారీ, మెగా పరిశ్రమలు ఐఈఎం పార్ట్-బి వివరాలు.
2. 4 నెలల (అక్టోబరు 19 నుంచి జనవరి 20) విద్యుత్ వినియోగ బిల్లులు
3. జీఎస్టీ ధ్రువీకరణ పత్రం (పరిధిలో ఉన్న సంస్థలు)
4. పాన్ కార్డు
5. ఆధార్ కార్డు
* ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన వివరాలను సంబంధిత జిల్లాల పరిశ్రమల అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపుతారు. విద్యుత్, జీఎస్టీ, యూఏఎం వివరాల ఆధారంగా లాక్‌డౌన్‌కు ముందు పరిశ్రమల పనితీరును అంచనా వేస్తారు.
* రీస్టార్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో వాస్తవాలను తప్పుగా చూపిస్తే ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో పొందే ప్రయోజనాలకు అనర్హులవుతారు. ఇప్పటికే పొందిన ప్రయోజనాలను ఆర్‌ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేస్తారు.
* విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ఛార్జీల చెల్లింపు వాయిదా సౌకర్యాన్ని వినియోగించుకునే భారీ, మెగా పరిశ్రమలు సంబంధిత మొత్తాన్ని 3 విడతలుగా చెల్లించాలి.
* ఎంఎస్‌ఎంఈలు విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన స్థిర ఛార్జీలు, డిమాండ్ ఛార్జీలకు సంబంధించి కమిటీ సూచించిన మొత్తాన్ని పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మరో అడుగు