బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తెలిపింది. సంక్షేమ పథకాల్లో అర్హత పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా బియ్యం కార్డులనే పరిగణించాలని పేర్కొంది. బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీపీఎల్ స్థాయి దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 4 ఏళ్లపాటు చెల్లుబాటు కానుంది. ఇతరులకు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం 4 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. రైతులకు రుణ మంజూరులోనూ బ్యాంకులు బియ్యం కార్డునే గుర్తించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
రేషన్ బియ్యం కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం - ఏపీలో బియ్యం కార్డులే ఆదాయ ధ్రూవీకరణ పత్రాలు న్యూస్
ఇకపై బియ్యం కార్డులే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కానున్నాయి. బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు) కుటుంబాలకు ఇచ్చే బియ్యం కార్డులే.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు పరిగణిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ap govt orders on ration card as income certificate