ఇంటింటికీ రేషన్ పంపిణీ కోసం మినీ ట్రక్కులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన బీసీ లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్, బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ట్రక్కులను అందించాలని నిర్ణయించింది. సంక్షేమం, స్వయం ఉపాధి పథకం కోసం మినీ ట్రక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.
మినీ ట్రక్కు కొనుగోలు మొత్తం వ్యయంలో 10 శాతం లబ్ధిదారులు భరించాలని ఆదేశాల్లో తెలిపింది. మిగిలిన 90 శాతం వ్యయాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇవ్వనున్నట్లు వివరించింది. వీటిలో 30 శాతాన్ని 72 ఈఎమ్ఐల్లో లబ్ధిదారులు చెల్లించాలని పేర్కొంది. మిగిలిన 60 శాతాన్ని సబ్సిడీగా అందించనున్నట్లు ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.