ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తాం: ఉద్యోగ సంఘాలు

emplyees on local bodies elections in  ap
emplyees on local bodies elections in ap

By

Published : Jan 9, 2021, 12:06 PM IST

Updated : Jan 10, 2021, 6:58 AM IST

12:01 January 09

టీకా ప్రక్రియ పూర్తైన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అభ్యంతరం

పంచాయతీ  ఎన్నికల నిర్వహణ ప్రకటనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. టీకా ప్రక్రియ పూర్తైన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరని స్పష్టం చేశాయి.

ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీ వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు ఎన్నికల విధులకు మానసికంగా సిద్ధంగా లేరని స్పష్టం చేసింది. ఏకపక్ష విధానం సమంజసం కాదని పేర్కొంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గలేదని.. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్​ వెంకట్రామిరెడ్డి అన్నారు. 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయని.. అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని సూచించారు.

అభ్యంతరాలను ఖాతరు చేయకుండా స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇవ్వడం ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్​ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తామని హెచ్చరించారు. తక్షణమే నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -చంద్రశేఖర్​రెడ్డి, ఏపీఎన్జీవో అధ్యక్షుడు

కరోనాతో దాదాపు 150 మంది రెవెన్యూ ఉద్యోగులను కోల్పోయాం. ఎన్నికలపై పునరాలోచన చేయాలని కోరాం. సీఎస్‌ కుదరదన్నా షెడ్యూల్ ఇచ్చారు. కొత్త స్ట్రెయిన్ వస్తుందని తెలిసీ నిర్వహిస్తున్నారు. అధికారులు, ఉద్యోగులను ఎస్‌ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నెల 31కి ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలి. వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం -బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ 

'వ్యాక్సిన్ వస్తున్న సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎందుకు? ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్‌ వేయాలి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు.. విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదు. బలవంతం‌ చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం. మాకు వ్యాక్సిన్‌ వేశాకైనా ఎన్నికలు పెడితే బాగుండేది' వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ 

'పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా యూకే స్ట్రెయిన్‌ వస్తుందని చెబుతున్నారు. వాక్సినేషన్ పూర్తయ్యాక ఎన్నికలు పెట్టాలి' -సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 

ఇదీ చదవండి:

వ్యాక్సినేషన్​లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రభుత్వానికి ఎస్​ఈసీ ఆదేశం

Last Updated : Jan 10, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details