ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖలు, పోలీసు అధికారులతో... ఆమె సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సరిహద్దులతోపాటు కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర తనిఖీల నిర్వహణపై చర్చించారు. టోల్‌ఫ్రీ నెంబర్ 14500కు ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని నిర్దేశించారు. పంచాయతీరాజ్, పోలీస్, ఎక్సైజ్, భూగర్భ గనుల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ... ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మినహాయింపులు ఇచ్చే అంశంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. క్రీడల కోటాతోపాటు ఇంకా భర్తీ కావాల్సి ఉన్న వివిధ కేటగిరీలపై నీలం సాహ్ని సమీక్షించారు. మిగిలిన పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
'ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడండి' - ap cs neelam sahni latest review on sand
పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖలు, పోలీసు అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.
ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడండి: సీఎస్ నీలం సాహ్ని
TAGGED:
cs neelam sahni latest news