దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం.. రాగల 48 గంటల్లో వాయుగుండంగా బలపడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 2 నాటికి తమిళనాడు వద్ద తీరం దాటనుండగా.. డిసెంబర్ 1 నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నట్లు వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రాగల 24 గంటల్లో ప్రకాశం, కర్నూలు తదితర చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
మరో వాయుగుండం! 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం
దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
48 గంటల్లో తుపానుగా మారే అవకాశం