ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - telugu latest news

.

ANDHRA PRADESH
ANDHRA PRADESH

By

Published : Dec 5, 2020, 1:00 PM IST

  • ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్‌ ముట్టడే: రైతులు

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సినందేనని పట్టుబడుతున్నారు రైతులు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కర్ణాటక బంద్​ ఉద్రిక్తం.. పలువురి అరెస్ట్​!

మరాఠా అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటును నిరసిస్తూ కర్ణాటకలో బంద్​ చేపట్టాయి కన్నడ అనుకూల సంఘాలు. బెంగళూరులోని టౌన్​హాల్​ వద్ద పెద్ద ఎత్తన కార్యకర్తల చేరి నిరసన తెలిపారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే.. ఈ నెల 7న నిరసన'

వరుస నష్టాలతో విలవిల్లాడుతున్న రైతులను ఆదుకొనేందుకు... మద్యం అమ్మకాలతో వచ్చిన ఆదాయాన్ని వెచ్చంచాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పూర్తిగా నష్టపోయాం.. పరిహారం అందలేదు: లోకేశ్​తో రైతులు

గుంటూరు జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటించారు. పచ్చలతాడిపర్రులో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • తిరుమల శ్రీవారి దర్శనం ఆన్​లైన్ టికెట్లకు పెరిగిన డిమాండ్

తిరుమల శ్రీవారి దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లకు భారీ స్పందన వస్తుంది. టికెట్ల కోసం ప్రయత్నించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో పరిమితంగా సర్వదర్శన టికెట్లను జారీచేస్తున్న తితిదే.. ప్రత్యేక ప్రవేశ దర్శన కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పిటిషన్​ దాఖలు చేసిన 23ఏళ్లకు ధర్మాసనం వద్దకు..

రిజిస్ట్రీ పనితీరుపై కోల్​కతా హైకోర్టు తీవ్ర ​అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ మహిళ దాఖలు చేసిన హెబియస్​ కార్పస్ పిటిషన్​ను 23 ఏళ్లకు ధర్మాసనం వద్దకు విచారణకు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • చిన్న పట్టణాల నుంచే 59శాతం ఆర్డర్లు

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్నా, ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ కామర్స్​ ఆర్డర్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఆర్డర్లు పరిమాణంలో 56 శాతం, స్థూల వ్యాపార విలువలో (జీఎమ్‌వీ) 50 శాతం వృద్ధిని నమోదు చేశాయని యూనికామర్స్‌ నివేదిక వెల్లడించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు మృతి​

చైనా యోంగ్​చువాన్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో చిక్కుకుని 18మంది మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. గని లోపల కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయు పరిమితి మించటం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కివీస్ క్రికెటర్ అండర్సన్ రిటైర్మెంట్

న్యూజిలాండ్ ఆల్​రౌండర్ కోరె అండర్సన్.. యుక్త వయసులోనే అంతర్జాతీయ కెరీర్​కు ముగింపు పలికాడు. అమెరికన్ లీగ్​లో పాల్గొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఒకే చిత్రంలో పవర్ స్టార్, సూపర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది?. ప్రతి ఒక్క అభిమాని కల ఇది. ఆ కల తొందర్లోనే నిజమవబోతుందని సమాచారం. ఎలా, ఎప్పుడు అని అనుకుంటున్నారా!.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details