రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న జగనన్న కాలనీలతో పాటు టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరా అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మూడు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు హాజరయ్యారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మూడు డిస్కమ్‌లకు చెందిన సీఎండీలతో ఈ అంశాలపై సమీక్షించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణం కానున్న జగనన్న కాలనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందన్న అంశంపై చర్చించారు. లే ఆవుట్లలో విద్యుత్ స్థంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.
ELECTRICITY: జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారుల సమీక్ష
జగనన్న కాలనీలు, టిడ్కో నివాసాలకు విద్యుత్ సరఫరా అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మూడు డిస్కమ్‌లకు చెందిన సీఎండీలతో ఈ అంశాలపై చర్చించారు. జగనన్న కాలనీలకు విద్యుత్ కనెక్షన్లను ఇచ్చేందుకు ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందన్న అంశంపై సమీక్షించారు.
ఆయా డిస్కమ్‌ల పరిధిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సూచించారు. మరోవైపు ట్రూ ఆప్ ఛార్జీల సర్దుబాటు వ్యవహారంపైనా ఇంధన శాఖ కార్యదర్శి డిస్కమ్‌ల సీఎండీలతో చర్చించారు. సిబ్బంది జీతాలు, బొగ్గు, విద్యుత్ కొనుగోలు వ్యయం తదితర ఛార్జీలను వినియోగదారులకు బదిలీ చేసేందుకు ఏపీఈఆర్సీ అంగీకారాన్ని తెలిపిందని అందుకు తగినట్టుగానే సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు సమావేశంలో చర్చించారు.
ఇదీ చదవండి: