ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ పోరు: మధ్యాహ్నం 2.30 వరకు పోలింగ్​ శాతం ఇలా.. - ap panchayath elections live

andhra pradehs fourth phase elections live updates
andhra pradehs fourth phase elections live updates

By

Published : Feb 21, 2021, 6:16 AM IST

Updated : Feb 21, 2021, 4:01 PM IST

15:57 February 21

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు..ఉన్నతాధికారుల హర్షం

  • పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంపై ఉన్నతాధికారుల హర్షం 
  • పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌ను అభినందించిన అధికారులు 
  • అన్ని చర్యలు తీసుకుని, సిబ్బందిని ప్రోత్సహించారన్న అధికారులు 
  • నాలుగోదశలో పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారన్న అధికారులు

15:37 February 21

ముగిసిన ఎన్నికల పోలింగ్‌

  • ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • పోలింగ్ ముగిసే వేళకు వరుసలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
  • కాసేపట్లో ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు

15:16 February 21

మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.9 శాతం పోలింగ్

పోలింగ్ శాతం
  • రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.9 శాతం పోలింగ్
  • అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85.6 శాతం నమోదు
  • అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 73.2 శాతం నమోదు

15:03 February 21

  • కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 79.27 శాతం పోలింగ్

14:57 February 21

  • కడప జిల్లాలో మధ్యాహ్నం 2.30 వరకు 80.68 శాతం పోలింగ్

14:42 February 21

పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

  • కృష్ణా : రెడ్డిగూడెం పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
  • వృద్ధురాలిని బూత్‌లోకి తీసుకెళ్లి అభ్యర్థి ఏజెంట్‌ ఓటు వేయించాడని ఆరోపణ
  • కృష్ణా : ఇరువర్గాలకు సర్దిచెప్తున్న పోలీసులు

14:11 February 21

సద్దుమణిగిన వివాదం

  • గుంటూరు: వట్టిచెరుకూరు మం. ముట్లూరులో సద్దుమణిగిన వివాదం
  • గాయపడిన పోలింగ్ ఏజెంట్‌ గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు
  • దాడి కారకులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమ్మిరెడ్డి హామీ
  • ముట్లూరులో అదనపు పోలీసు బలగాల మోహరింపు

13:31 February 21

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ..

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
  • గుంటూరు: క్రోసూరులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన గ్రామీణ ఎస్పీ
  • క్యూలో ఓటర్లను అడిగి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ విశాల్ గున్నీ
  • సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాం: ఎస్పీ

13:31 February 21

ఇరువర్గాల తోపులాట

  • గుంటూరు: ముప్పాళ్ల మండలం మాదలలో ఇరువర్గాల తోపులాట
  • అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు అభ్యర్థి యత్నం
  • మరో వర్గం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట
  • గుంటూరు: ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

13:29 February 21

పోలింగ్ శాతం

చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌  కొనసాగుతోంది.  రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 వరకు 66.60 శాతం పోలింగ్‌ నమోదైంది. 

13:29 February 21

ఏజెంట్లపై దాడి..

  • గుంటూరు: వట్టిచెరుకూరు మం. ముట్లూరులో ఉద్రిక్తత
  • ముట్లూరులోని 5, 7 పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపై దాడి
  • ఏజెంట్లపై దాడి చేసి బయటకు పంపిన ప్రత్యర్థులు
  • గాయపడిన బాబూరావుకు ముట్లూరు పీహెచ్‌సీలో చికిత్స
  • ఆసుపత్రి వద్ద బాబూరావు మద్దతుదారుల ఆందోళన
  • దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

13:28 February 21

వృద్ధుడు మృతి..

  • కడప: ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లెలో విషాదం
  • ఓటు వేసి బయటకు వచ్చాక సొమ్మసిల్లి పడిన వృద్ధుడు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బుచ్చన్న (65) మృతి

13:15 February 21

కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

  • కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 వరకు 66.60 శాతం పోలింగ్‌
  • శ్రీకాకుళంలో 62.07, విజయనగరంలో 77.20 శాతం పోలింగ్‌
  • విశాఖలో 73.30, తూ.గో. జిల్లాలో 64.04 శాతం పోలింగ్‌
  • ప.గో. జిల్లాలో 63.29, కృష్ణాలో 62.82, గుంటూరులో 62.87 శాతం పోలింగ్‌
  • ప్రకాశంలో 61.79, నెల్లూరులో 61.62 శాతం పోలింగ్‌
  • చిత్తూరులో 66.62, కడపలో 69.93 శాతం పోలింగ్‌
  • కర్నూలులో 68.62, అనంతపురంలో 71.65 శాతం పోలింగ్‌

13:03 February 21

పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపై దాడి

గుంటూరు: వట్టిచెరుకూరు మం. ముట్లూరులో ఉద్రిక్తత
ముట్లూరులోని 5, 7 పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లపై దాడి
ఏజెంట్లపై దాడి చేసి బయటకు పంపిన ప్రత్యర్థులు
గాయపడిన బాబూరావుకు ముట్లూరు పీహెచ్‌సీలో చికిత్స
ఆసుపత్రి వద్ద బాబూరావు మద్దతుదారుల ఆందోళన
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

12:48 February 21

వృద్ధుడు మృతి

కడప: ఎర్రగుంట్ల మం. తుమ్మలపల్లెలో విషాదం

ఓటు వేసి బయటకు వచ్చాక సొమ్మసిల్లి పడిన వృద్ధుడు

ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బుచ్చన్న (65) మృతి

12:32 February 21

ఇరువర్గాల ఘర్షణ

  • విశాఖ: పరవాడ మం. ముత్యాలమ్మపాలెంలో ఇరువర్గాల ఘర్షణ
  • వేరేచోట నుంచి తీసుకువచ్చి ఓట్లు వేయిస్తున్నారని మరో వర్గంతో వాగ్వాదం
  • విశాఖ: పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

12:16 February 21

ఇద్దరు వృద్ధులు మృతి

  • తూర్పు గోదావరి  జిల్లాలో ఓటేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి
  • మామిడికుదురు మం. కొమరాడలో 65 ఏళ్ల వృద్ధుడు మృతి
  • తూర్పుగోదావరి జిల్లాలో ఓటు వేసిన తర్వాత వృద్ధుడు ఆకస్మిక మృతి
  • కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో వృద్ధుడు మృతి
  • పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలిన 80 ఏళ్ల వృద్ధుడు

12:10 February 21

  • పశ్చిమగోదావరి జిల్లా  ఉంగుటూరు మండలం కైకరంలో ఎస్పీ పర్యటన
  • పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్పీ నారాయణ నాయక్

12:07 February 21

ఇరువర్గాల ఘర్షణ..

  • కృష్ణా: ఉంగుటూరు మం. తేలప్రోలులో ఇరువర్గాల ఘర్షణ
  • తమకే ఓటు వేయాలంటూ పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల నినాదాలు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

11:59 February 21

వడ్డిపాళెంలో ఉద్రిక్తత..

  • నెల్లూరు: కొడవలూరు మండలం వడ్డిపాళెంలో ఉద్రిక్తత
  • ఒకరి ఓటు మరొకరు వేశారంటూ ఒక వర్గంపై మరో వర్గం దాడి
  • నెల్లూరు: వడ్డిపాళెంలో మోహరించిన పోలీసులు

11:38 February 21

విజయనగరం జిల్లాలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యటన

  • విజయనగరం జిల్లాలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యటన
  • కొత్తవలసలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీజీపీ
  • పోలింగ్ సరళిపై ఎస్పీ, జేసీని అడిగి తెలుసుకున్న డీజీపీ
  • పోలింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లపై ఓటర్లతో మాట్లాడిన డీజీపీ
  • పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి: డీజీపీ
  • ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు: డీజీపీ
  • ఇప్పటివరకు చెదురుమదురు ఘటనలు జరిగాయి: డీజీపీ
  • అన్ని ఫిర్యాదులపై స్పందిస్తున్నాం: డీజీపీ
  • ఎన్నికల నిర్వహణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం: డీజీపీ
  • ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటాం: డీజీపీ

11:28 February 21

'వృద్ధురాలి ఓటు ఎవరేశారు.!'

  • ప.గో.: నిడమర్రు మం. గుణపర్రులో నిలిచిన పోలింగ్
  • వృద్ధురాలి ఓటు పోలింగ్ సిబ్బందే వేశారంటూ ఆందోళన
  • రీ పోలింగ్ నిర్వహించాలని పట్టుపట్టిన ఆందోళనకారులు
  • ప.గో.: పోలింగ్‌ కేంద్రం వద్ద భారీగా వేచి ఉన్న ఓటర్లు

11:27 February 21

తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న ఓటర్లు..

  • ప్రకాశం: మార్కాపురం మం. దరిమడుగులో ఓటర్ల ఆందోళన
  • తమ ఓట్లు వేయనీయడం లేదంటూ ఓటర్ల ఆందోళన
  • ఘటనాస్థలికి వచ్చిన తహసీల్దార్ వాహనాన్ని అడ్డుకున్న ఓటర్లు

11:27 February 21

ఎన్నికల సరళిని పరిశీలించిన ఎస్పీ

  • ప్రకాశం: మార్కాపురం మం. రాయవరంలో ఎస్పీ పర్యటన
  • రాయవరంలో ఎన్నికల సరళిని పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్
  • కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఓటర్లను అడిగి తెలుసుకున్న ఎస్పీ

11:27 February 21

ఇరువర్గాల వాగ్వాదం

  • శ్రీకాళహస్తి మం. రాచగున్నేరిలో ఇరువర్గాల వాగ్వాదం
  • ఓటు విషయంలో పోలింగ్‌ కేంద్రం ఎదుట ఇరువర్గాల వాగ్వాదం
  • చిత్తూరు: ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు

11:14 February 21

గుర్తులు ప్రచారం..

  • కర్నూలు: ఆలూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల వాగ్వాదం
  • అభ్యర్థుల గుర్తులు ప్రచారం చేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు
  • ఇరువర్గాలను ఘటనాస్థలి నుంచి పంపిన పోలీసులు

11:13 February 21

ఇరువర్గాల వాగ్వాదం

  • సత్తెనపల్లి మం. గార్లపాడులో ఇరువర్గాల వాగ్వాదం
  • ఓటరును పోలింగ్‌ కేంద్రంలోనికి పంపే విషయంలో వివాదం
  • గుంటూరు: పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

11:13 February 21

ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు మృతి

  • తూ.గో.: ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు మృతి
  • పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలిన 80 ఏళ్ల వృద్ధుడు
  • తూ.గో.: కాట్రేనికోన మం. చెయ్యేరు అగ్రహారంలో ఘటన

11:10 February 21

పోలింగ్ శాతం

రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్లలో నాలుగో విడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఆరున్నర నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత, వృద్ధులూ వచ్చారు. ఉదయం 10.30 గంటలకు 41.55 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 54.70 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 33.94 శాతం పోలింగ్​ నమోదైంది. 

10:54 February 21

  • ప్రకాశం: మార్కాపురం మం. దరిమడుగులో వివాదం
  • పోలింగ్ కేంద్రాలకు పెద్దఎత్తున తరలివచ్చిన విద్యార్థులు
  • పలువురి ఓట్లు అప్పటికే నమోదు కావడంపై అభ్యంతరం
  • ఓటు ముందే నమోదు కావడంపై అధికారులను నిలదీసిన విద్యార్థులు
  • మరికొందరికి గుర్తింపు కార్డులు సరిగా లేవని తిరస్కరించిన అధికారులు

10:43 February 21

  • అనంతపురం ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై ఎస్పీకి తెదేపా నేతల ఫిర్యాదు
  • నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఫిర్యాదు
  • హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పర్యటనపై ఫిర్యాదు

10:38 February 21

కుర్చీలతో కొట్టుకున్న ఏజెంట్లు..

  • గుంటూరు: సత్తెనపల్లి మం. ధూళిపాళ్ల పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
  • పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీలతో కొట్టుకున్న ఏజెంట్లు, ఇద్దరికి గాయాలు
  • సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బాధితుల తరలింపు

10:31 February 21

పోలీసుల అదుపులో తెదేపా నాయకులు

  • పోలీసుల అదుపులో మంత్రాలయం నియోజకవర్గ తెదేపా నాయకులు
  • వేకువజామునే తెదేపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కర్నూలు: తెదేపా నాయకులను పోలీస్‌స్టేషన్లకు తరలించిన పోలీసులు
  • కర్నూలు: కోసిగి, మంత్రాలయం, కౌతాలం పోలీస్‌స్టేషన్లకు తరలింపు
  • ఎన్నికల నేపథ్యంలో తెదేపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

10:17 February 21

నిలిచిన పోలింగ్

  • ప.గో.: నిడమర్రు మండలం గుణపర్రులో నిలిచిన పోలింగ్
  • ఓ వర్గం వ్యక్తులు రిగ్గింగ్‌ చేశారంటూ మరో వర్గం ఆందోళన
  • ప.గో.: ఆందోళనతో పోలింగ్ నిలిపివేసిన సిబ్బంది

10:05 February 21

పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన

  • కృష్ణా: ఉంగుటూరు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన
  • వృద్ధ దంపతులతో ఓటు వేయించేందుకు వచ్చిన బయటి వ్యక్తి
  • ఓటు వేయించేందుకు బయటి వ్యక్తి రావడంపై ఓటర్ల అభ్యంతరం
  • ఆర్‌వో, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
  • కృష్ణా: ఉంగుటూరు జడ్పీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఘటన

10:04 February 21

పోటెత్తిన ఓటర్లు..

  • విశాఖ జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • ఆనందపురం మం. ముకుందాపురంలో 72 శాతం పోలింగ్‌
  • మూడు గంటల్లోనే 72 శాతం పోలింగ్‌ జరిగిందన్న ఆర్‌వో

10:04 February 21

10:04 February 21

ఎన్నికల అధికారులతో వృద్ధురాలు వాగ్వాదం..

ఎన్నికల అధికారులతో వృద్ధురాలు వాగ్వాదం
  • కర్నూలు: ఎన్నికల అధికారులతో వృద్ధురాలు వాగ్వాదం
  • అప్పటికే ఓటు నమోదైనట్లు వృద్ధురాలికి తెలిపిన అధికారులు
  • తన ఓటు ఇతరులు ఎలా వేస్తారని నిలదీసిన వృద్ధురాలు
  • కర్నూలు: ఆదోని మం. ఆరెకల్లు 9వ వార్డులో ఘటన

10:03 February 21

స్పృహతప్పిన సర్పంచ్‌ అభ్యర్థి..

అనంతపురం జిల్లాలో ఓటేసేందుకు వచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి స్పృహతప్పి పడిపోయింది. హిందూపురం బేవన్నహళ్లిలో సర్పంచ్‌ అభ్యర్థి భాగ్యమ్మ ఓటేసేందుకు వచ్చి కిందపడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

09:22 February 21

వాలంటీర్‌ అత్యుత్సాహం

వాలంటీర్‌ అత్యుత్సాహం

కృష్ణా జిల్లా నూజివీడు మండలం పాతరావిచర్లలో.. పోలింగ్‌ కేంద్రంలోకి వాలంటీర్‌ పదేపదే వెళ్లటం వివాదానికి దారితీసింది. కుటుంబసభ్యులకు సాయం చేసే నెపంతో వస్తున్న వాలంటీర్‌కు పోలీసులు హెచ్చరిక జారీచేశారు. దీనిపై వాగ్వాదం తలెత్తటంతో..స్థానికులకు పోలీసులు నచ్చజెప్పారు. వాలంటీర్‌ ప్రవేశంపై మరో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయటంతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని వాలంటీర్‌కు పోలీసులు గట్టిగా చెప్పటంతో.. ఆయన అక్కడి నుంచి వెనుతిరిగాడు.

09:17 February 21

పోలింగ్ శాతం

పోలింగ్ శాతం

రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్లలో నాలుగో విడత పంచాయతీ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఆరున్నర నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత, వృద్ధులూ వచ్చారు. ఉదయం 8.30 గంటలకు 13.42 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 22.50 శాతం, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 8.44 శాతం పోలింగ్​ నమోదైంది. 

09:15 February 21

ఏజెంట్ల మధ్య వివాదం

  • చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎంపెడులో ఏజెంట్ల మధ్య వివాదం
  • ఏజెంట్ల మధ్య వివాదంతో కాసేపు నిలిచిన పోలింగ్

09:06 February 21

  • ప.గో. జిల్లాలో ఉదయం 8.30 వరకు 14.12 శాతం పోలింగ్‌
  • ప్రకాశం జిల్లాలో ఉదయం 8.30 వరకు 9.31 శాతం పోలింగ్‌
  • గుంటూరు జిల్లాలో ఉదయం 8.30 వరకు 13.94 శాతం పోలింగ్‌

09:02 February 21

  • కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • విశాఖ జిల్లాలో ఉదయం 8.30 వరకు 18.48 శాతం పోలింగ్‌

08:56 February 21

  • కడప: 11 మండలాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్‌
  • 114 పంచాయతీల్లో ఉదయం 8.30 వరకు 9.35 శాతం పోలింగ్

08:41 February 21

  • అనంతపురం: పెనుకొండ పరిధి 13 మండలాల్లో పోలింగ్‌
  • ఉదయం 7.30 గంటల వరకు 4.59 శాతం పోలింగ్

08:02 February 21

పోలింగ్‌ వాయిదా..

అనంతపురం: లేపాక్షి మండలం కోడిపల్లి రెండో వార్డుకు నిలిచిన పోలింగ్‌

రిజర్వేషన్‌లో జరిగిన పొరపాటుతో పోలింగ్‌ వాయిదా వేసిన అధికారులు

07:35 February 21

నిలిచిన విద్యుత్ సరఫరా

  • నెల్లూరు: కోవూరు మండలం పెళ్లకూరులో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • నెల్లూరు: పది పోలింగ్‌ కేంద్రాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • విద్యుత్‌ సరఫరా లేక అవస్థలు పడుతున్న వృద్ధులు
  • పెళ్లకూరులో వర్షంలోనే కొనసాగుతున్న పోలింగ్‌
     

06:50 February 21

కొనసాగుతున్న పోలింగ్

కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌
  • మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్న పోలింగ్
  • సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
  • ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక
  • 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల్లో పోలింగ్‌
  • 3,299 పంచాయతీల్లో 554 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం
  • రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ
  • 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 స్థానాలు ఏకగ్రీవం
  • మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • నాలుగో విడతలో 28,995 కేంద్రాల్లో పోలింగ్
  • నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బంది నియామకం

06:26 February 21

పోలింగ్ ప్రారంభం

  • చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం
  • మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్న పోలింగ్
  • సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
  • ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక
  • 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల్లో పోలింగ్‌
  • 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవం
  • రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ
  • 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 స్థానాలు ఏకగ్రీవం
  • మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 67,75,226 మంది ఓటర్లు
  • నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
  • నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బంది నియామకం

06:06 February 21

  • నేడు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు
  • ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
  • సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
  • ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక 
  • 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల్లో పోలింగ్‌
  • 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 554 మంది ఏకగ్రీవం
  • రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ
  • 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 స్థానాలు ఏకగ్రీవం
  • మిగిలిన 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు దాఖలు కాని నామినేషన్లు
  • మిగతా 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ
  • ఓటుహక్కు వినియోగించుకోనున్న 67,75,226 మంది ఓటర్లు
  • నాలుగో విడతలో 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 
  • 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
  • నాలుగో విడతలో 53,282 మంది పోలింగ్ సిబ్బంది నియామకం
Last Updated : Feb 21, 2021, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details