ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పాదయాత్రకు.. చురుగ్గా రైతుల ఏర్పాట్లు

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్రకు రైతులు సిద్దమయ్యారు. రేపు ప్రారంభం కానున్న పాదయాత్రకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

రేపటి పాదయాత్రకు సిద్దమైన రైతులు
రేపటి పాదయాత్రకు సిద్దమైన రైతులు

By

Published : Oct 31, 2021, 3:55 PM IST

"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పాదయాత్రకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. రేపు ప్రారంభం కానున్న ఈ పాదయాత్రకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే పాదయాత్రకు అనుమతి రావడంతో ఐకాస నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని రైతుల ఉద్యమం ప్రారంభమై నేటికి 684 రోజులు కాగా.. ఇవాళ కూడా 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. రేపటి పాదయాత్రకు అంతా తరలిరావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాదయాత్ర కోసం ప్రత్యేక ఫ్లెక్సీలు రూపొందించారు. వెలగపూడిలోని ఐకాస కార్యాలయంలో నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు.

తెదేపా మద్దతు..
రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని తెదేపా నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో అమరావతి ఐకాస నేతలతో సమావేశమైన తెదేపా నేతలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ మద్దతు తెలపాలని కోరారు. ప్రజలందరూ ఈ పాదయాత్రలో భాగస్వామ్యులై జయప్రదం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

GUTKA CAUGHT: ధాన్యం బస్తాల మధ్య గుట్కా తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details