ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంధకారంలోకి రాజధాని అమరావతి భవిష్యత్తు: అమర్​నాథ్ రెడ్డి

అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించేందుకు వైకాపా ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నిందని మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టించే ప్రజా రాజధాని అమరావతి భవిష్యత్తుని సీఎం జగన్‌ అంధకారంలోకి నెట్టారని ఆయన మండిపడ్డారు.

అంధకారంలోకి  రాజధాని అమరావతి భవిష్యత్తు
అంధకారంలోకి రాజధాని అమరావతి భవిష్యత్తు

By

Published : Dec 14, 2020, 3:15 PM IST

సంపద సృష్టించే ప్రజా రాజధాని అమరావతి భవిష్యత్తును సీఎం జగన్‌ అంధకారంలోకి నెట్టారని మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో భూములు తీసుకున్న 130 సంస్థలు కొనసాగి ఉంటే...యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించేందుకు వైకాపా ప్రభుత్వం ఎన్నో కుట్రలు పన్నిందని ఆరోపించారు.

దురుద్దేశంతోనే రాజధానిని నాశనం చేస్తూ...ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం మాని.. రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆయన హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details