రైతుల దీక్షలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ సీఎం జగన్ సచివాలయానికి వస్తుండటంతో పోలీసులు పహారా పెంచారు. కొత్త శిబిరంలో రైతుల ఆందోళనకు అనుమతి నిరాకరించారు. మందడంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ప్రైవేటు స్థలంలో ఆందోళనకు అభ్యంతరమేంటని మహిళలు ప్రశ్నించారు. దీక్షా శిబిరాన్ని ఖాళీచేసేది లేదంటూ రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు - రాజధాని రైతుల ఆందోళనలు
రాజధాని రైతుల ఆందోళనలు 77వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నా కొనసాగుతోంది. వెలగపూడిలో 77వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. రాయపూడి, నేలపాడు, పెదపరిమి, ఇతర రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు
Last Updated : Mar 3, 2020, 10:45 AM IST