రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రజలు, రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో అన్నదాతలు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. శాసనమండలి నిర్ణయంతో తాత్కాలిక ఊరట లభించిందని చెబుతున్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు..
'ఇది తాత్కాలిక ఉపశమనమే.. శాశ్వత పరిష్కారం కావాలి' - వెలగపూడిలో అమరావతి ఆందోళనలు
సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం తమకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని రాజధాని రైతులు చెబుతున్నారు. శాశ్వత పరిష్కారం దక్కే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
వెలగపూడిలో అమరావతి ఆందోళనలు