అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి మహిళా జేఏసీ దిల్లీకి పయనమైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఏడుగురు సభ్యులు గల మహిళా జేఏసీ బృందం హస్తినకు బయలుదేరింది. ప్రస్తుతం దిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున... అన్ని పార్టీల నేతలను కలసి రాజధాని రైతుల ఆవేదనను తెలియజేస్తామని మహిళలు తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో జరిగిన అభివృద్ధిని వారికి వివరించి... వినతి పత్రం సమర్పిస్తామని వెల్లడించారు.
రాజధాని కోసం హస్తినకు అమరావతి మహిళా ఐకాస నేతలు - అమరావతి మహిళా ఐకాస తాజా వార్తలు
అమరావతి మహిళా ఐకాస నేతలు హస్తినకు బయల్దేరారు. దిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున...అన్ని పార్టీల నేతలను కలసి రాజధాని రైతుల ఆవేదనను తెలియజేస్తామని మహిళలు తెలిపారు.
హస్తిన బయల్దేరిన అమరావతి మహిళా ఐకాస నేతలు