గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద నిరసన తెలుపుతున్న అమరావతి జేఏసీ నేతలు, రాజధాని ప్రాంత నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తాడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహిళలను అక్రమంగా అరెస్ట్ చేయటం ప్రభుత్వానికి మంచిది కాదని జేఏసీ నాయకులు ఆరోపించారు. మహిళలను దురుసుగా వాహనాలలోకి ఎక్కించటం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్సీ, బీసీ రైతులకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేసిందని వారికి సంఘీభావం తెలిపేందుకు వస్తే అరెస్ట్ చేయటం సరికాదన్నారు.
జైల్ భరో.. అమరావతి జేఏసీ నేతల అరెస్ట్ - జైల్ భరో కార్యక్రమం అప్ డేట్స్
గుంటూరు జిల్లా సబ్ జైలు వద్ద నిరసన తెలుపుతున్న అమరావతి జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రైతులను అరెస్టు చేయటం దారుణమని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి జేఏసీ నేతల అరెస్ట్
Last Updated : Oct 31, 2020, 8:47 PM IST