పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 269వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అనంతవరం, రాయపూడి, పెదపరిమి గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు సాష్టాంగ నమస్కారాలు చేశారు.
మోదీ సార్ మాకు సమాధానం చెప్పండి: అమరావతి రైతులు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 269వ రోజుకు చేరింది. మూడు రాజధానులు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని న్యాయస్థానాల్లో అఫిడవిట్ సమర్పించడాన్ని రైతులు తప్పుబట్టారు. దిల్లీని మించిన రాజధాని నిర్మాణం కోసం సహకరిస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఈ రోజు రైతులకేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాజధాని కోసం భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ నినాదాలు చేశారు. అనంతరం దీక్షలో మహిళలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కొంగు చాపి కేంద్రానికి విన్నవించారు. దిల్లీని మించిన రాజధాని నిర్మాణం కోసం సహకరిస్తామని చెప్పిన ప్రధాని మోదీ.. ఈ రోజు రైతులకేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. మూడు రాజధానులు పెట్టుకునేందుకు అభ్యంతరం లేదని న్యాయస్థానాల్లో అఫిడవిట్ సమర్పించడాన్ని రైతులు తప్పుబట్టారు.
ఇదీ చదవండి:టార్గెట్ లాలూ: యాదవుల ఓట్లపై నితీశ్ గురి