ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Maha Padayathra: తొమ్మిదో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో మంగళవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన పాదయాత్ర కొణికిపల్లె, కొణికి మీదుగా దుద్దుకూరుకు సాయంత్రం 5.30 గంటలకు చేరింది. దాదాపు 10.5 కిలోమీటర్ల దూరం అశేష జనసందోహం మధ్య పాదయాత్ర సాగింది.

అమరావతి
AMARAVATHI FARMERS PADAYATHRA

By

Published : Nov 9, 2021, 10:07 AM IST

Updated : Nov 10, 2021, 10:39 AM IST

Maha Padayathra: తొమ్మిదో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో మంగళవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన పాదయాత్ర కొణికిపల్లె, కొణికి మీదుగా దుద్దుకూరుకు సాయంత్రం 5.30 గంటలకు చేరింది. దాదాపు 10.5 కిలోమీటర్ల దూరం అశేష జనసందోహం మధ్య పాదయాత్ర సాగింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు, మహిళలు, వృద్ధులు దారిపొడవునా పెద్ద సంఖ్యలో నిల్చొని స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. పాదయాత్రలో తాము సైతం అంటూ కిలోమీటర్ల కొద్దీ నడిచారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని నినదించారు.

నిబంధనలు పాటించాలి: ప్రకాశం జిల్లా ఏఎస్పీ

తెలంగాణలోని ఖమ్మం తెదేపా పార్లమెంట్‌ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వందమందికి పైగా వచ్చి సంఘీభావం తెలిపారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఎర్ర మాధవీలత యాత్రలో పాల్గొని రూ.5వేలు విరాళం అందజేశారు. సంతమాగులూరు మండలం నుంచి 85 సంవత్సరాల వృద్ధుడు గోరంట్ల పెద్ద సుబ్బారావు ఇంకొల్లు వరకు వచ్చి అక్కడినుంచి 10కి.మీ. నడిచారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, ఐకాస కోకన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, మహిళా ఐకాస కన్వీనర్‌ రాయపాటి శైలజ దుద్దుకూరులో విలేకర్లతో మాట్లాడారు. మహా పాదయాత్రకు రాష్ట్రంలో85% మందినుంచి మద్దతు లభిస్తోందన్నారు.

జాతీయ జెండాలతో స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

రూ.20 లక్షల విరాళాలు
పాదయాత్ర కోసం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కొల్లూరి నాయుడమ్మ ఆధ్వర్యంలో ఇంకొల్లుకు చెందిన 154 మంది రూ.5.64 లక్షలు విరాళంగా అందజేశారు. చినగంజాం మండలం గొనసపూడి వాసులు రూ.2,09,116 ..భీమవరం వాసులు రూ.1,82,200 ..మార్టూరు ప్రజలు రూ.1,51,116 ..నాగండ్లకు చెందిన సోమేపల్లి శివప్రసాద్‌ రూ.లక్ష, గొల్లపాలెం గ్రామస్థులు రూ.84 వేలు, సంతరావూరు నుంచి రూ.70 వేలు, హనుమోజీపాలెం స్థానికులు రూ.29 వేల విరాళంగా అందించారు. మొత్తంగా మంగళవారం ఒక్క రోజే సుమారు రూ.20 లక్షల విరాళాలు అందాయి.

తొమ్మిదో రోజు మహా పాదయాత్ర.

సీఎంకు అమరావతి బహుజన ఐకాస లేఖ..
రాజధాని రైతుల పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. రైతుల పాదయాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలు క్షమించరని మంగళవారం సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించగానే పోలీసులు రైతుల్ని ఇబ్బందిపెడుతున్నారు. వందల మంది మెహరించి భయోత్పాతాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో యాత్రను ఇష్టారీతిన చిత్రీకరిస్తున్నారు. మీరెవరని ప్రశ్నించినందుకు మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తూ తిరిగివారిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. నిర్వాహకుల్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల యాత్రకు సహకరించేలా డీజీపీని ఆదేశించాలి. లేనిపక్షంలో మీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో బోనెక్కించక తప్పదు’’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి:దాతృత్వం.. రూ.కోటి విలువైన స్థలం.. 150 మంది పేదలకు

Last Updated : Nov 10, 2021, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details