- మందడంలో దీక్షా శిబిరం వద్ద రైతులు,మహిళల ఆందోళన
- తమ బతుకులు బుగ్గి చేసే బిల్లు రద్దు చేయాలని డిమాండ్
- బిల్లు కాపీలు దహనం చేసి రైతులు,మహిళల నిరసన
- అమరావతి కోసం పోరాటం కొనసాగిస్తామంటున్న రైతులు
రాజధాని గ్రామాల్లో బంద్‌కు ఐకాస పిలుపు - రాజధాని గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన ఐకాస
11:21 January 21
మందడంలో దీక్షా శిబిరం వద్ద రైతులు, మహిళల ఆందోళన
10:29 January 21
ఎంపీ గల్లా జయదేవ్‌ను తక్షణమే విడుదల చేయాలని గుంటూరులో నిరసన
- ఎంపీ గల్లా జయదేవ్‌ను తక్షణమే విడుదల చేయాలని గుంటూరులో నిరసన
- గుంటూరు లాడ్జి సెంటర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనలు
- నిరసన ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు,రైతులు,తెదేపా నేతలు
- మూడు రాజధానులు వద్దు...అమరావతి ముద్దు అంటూ నినాదాలు
10:01 January 21
తుళ్లూరులో పోలీసులకు సహాయ నిరాకరణ
- తుళ్లూరులో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
- బంద్ పిలుపుతో స్వచ్ఛందంగా వర్తక,వాణిజ్య,విద్యాసంస్థల మూసివేత
- తుళ్లూరులో పోలీసులకు సహాయ నిరాకరణ
- ఇళ్లు, దుకాణాల ముందు పోలీసులు కూర్చోరాదంటూ అభ్యంతరం
- ఎవరూ ఆహార పదార్థాలు విక్రయించరాదని గ్రామస్థుల నిర్ణయం
10:00 January 21
పోలీసు పహారాలో అమరావతి
రాజధాని పరిధిలోని అన్నిగ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించే అవకాశముందని భావించిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామానికి రెండు వైపులా పోలీసులు మోహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం కూడలి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సచివాలయం వెనుకవైపు కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
08:50 January 21
తుళ్లూరులో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
తుళ్లూరులో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. బంద్ పిలుపుతో స్వచ్ఛందంగా వర్తక,వాణిజ్య,విద్యాసంస్థలు మూతపడ్డాయి.
08:23 January 21
మందడంలో రైతుల నిరసన
మందడంలో ఉదయం నుంచి రైతులు నిరసన చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏకు నిన్న మధ్యాహ్నం వరకు అభిప్రాయాలు తెలిపే అవకాశం కోర్టు ఇచ్చిందన్న రైతులు... కోర్టు తీర్పునకు విరుద్ధంగా గడువు కంటే ముందే మంత్రివర్గం ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. గడువుకంటే ముందే బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారని నిలదీశారు. తమ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని రైతులు ఆవేదన చెందారు.
07:36 January 21
రాజధాని గ్రామాల్లో బంద్‌కు ఐకాస పిలుపు
మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో ముందడుగు వేసినప్పటికీ తాము వెనక్కి తగ్గేది లేదని అమరావతి రైతులు తేల్చిచెప్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి దిగి వచ్చేవరకూ తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. 3 రాజధానుల అంశంపై బిల్లు పెట్టినందుకు... రైతులపై పోలీసుల లాఠీఛార్జ్‌కు నిరసనగా ఇవాళ రాజధాని బంద్ నిర్వహిస్తున్నారు.