ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ కోసం... ఇన్‌ఫ్రారెడ్ సమాచార ప్రామాణికం (ఐఆర్డీఏ) మీటర్లును ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యుత్ శాఖ అధికారులు లెక్కల ప్రకారం వ్యవసాయ కనెక్షన్లకు కనీసం ఒక్కక్క మీటరు ధర 2 వేల రూపాయలు ఉంటుంది. దీని ప్రకారం 17లక్షల 54వేల విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు 350కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది.
ఎక్కువ శాతం రైతులు పొలాల్లో మీటర్లను బహిరంగంగా చిన్న పెట్టల్లో అమర్చుతారు. ఇవి చెడిపోతే మరమ్మతు వ్యయాన్ని విద్యుత్ శాఖ భరిస్తుంది. మొదటిసారి మీటరు కాలినప్పుడు మాత్రం డిస్కంలు కొత్తవి ఏర్పాటు చేస్తాయి. తర్వాత నుంచి ఖర్చు రైతుపైనే పడుతుంది. నిర్మానుష్యంగా ఉండే పొలాల్లో ఏర్పాటు చేసే మీటర్లు చోరికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. మీటరు చోరీ అయితే కొత్తది ఏర్పాటు చేయటానికయ్యే ఖర్చును రైతే భరించాలి. సింగిల్ ఫేజ్‌కు 950 రూపాయలు, త్రీఫేజ్‌కు 2250 రూపాయల వంతున చెల్లించాల్సి ఉంది. మీటరు కాలినా చోరీ అయినా కొత్త మీటర్లు ఖర్చును ఎవరు భరించాలనే అంశంపై తాజా ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. ఈ భారం రైతుపైనే పడే అవకాశాలున్నాయి.
డిస్కంలకూ ఆర్థిక భారం..