ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 1, 2021, 10:47 PM IST

ETV Bharat / city

'కోదండ రాముడి విగ్రహం ధ్వంసం.. హిందూ మతంపై దాడే'

జగన్ రెడ్డి పాలనలో రోజుకో దేవాలయంలో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని దుండగులు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.

Achennaidu release temples attack data in ap
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

వైకాపా ప్రభుత్వ 19 నెలల పాలనలో రాష్ట్రంలో 126 ఆలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేర దాడులకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఈ విధ్వంసాలను ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. ఒక్క మంత్రివర్గ సమావేశంలో కూడా ఎందుకు చర్చించలేదని నిలదీశారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఈ తరహా విధ్వంస ఘటనలు జరగలేదన్నారు.

సీబీఐ విచారణ ఏమైంది?

నూతన సంవత్సరం ఎవరైనా ఆనందోత్సవాలతో ప్రారంభిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ధ్వంసంతో కొత్త ఏడాది ప్రారంభమైందని విమర్శించారు. ప్రజల నుంచి నిత్యం పూజలు అందుకునే విగ్రహాలపై దాడులు జరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని తెలిపారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్వేషం, విధ్వంసం తప్ప దేవాలయాల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని ధ్వజమెత్తారు. జగన్​రెడ్డి పాలనలో దుండగలు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే: పవన్‌

ABOUT THE AUTHOR

...view details