ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

..

By

Published : May 14, 2022, 8:56 AM IST

9AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM

  • మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ.. ఎందుకంటే..?
    Varla Ramaiah letter to Peddireddy: సత్యవేడులోని ఆరణి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైకాపా నేతల అండతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఇసుక తవ్వకాల వీడియోలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కడపలో డంపింగ్ యార్డు వివాదం.. ప్రజల ఆగ్రహం
    Kadapa dumping yard: కడప నగరం నడిబొడ్డున డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం వివాదస్పదంగా మారింది. చుట్టూ ఆస్పత్రులు, జనావాసాలున్నా.. అధికారులు ఏ మాత్రం పట్టించుకుకోకుండా చెత్త నిల్వ చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును తొలగించాలని హైకోర్టు ఆదేశించినా నగరపాలక సంస్థ అధికారులు లెక్క చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amithsha tour : నేడు తెలంగాణకు అమిత్ షా
    Amithsha tour: ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభకు సర్వం సిద్ధమైంది.‌ సభకు ముఖ్య అతిథిగా భాజపా ట్రబుల్ షూటర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. అమిత్‌ షా హాజరయ్యే సభను భాజపా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 5 లక్షల మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధికార పార్టీ అండతో ఆక్రమణలు.. ఏకంగా 700 ఎకరాల్లో..
    Land occupation: 'వడ్డించేవాడు మనవాడైతే... బంతిలో ఎక్కడ కూర్చున్నా ముక్కలు పడతాయి' అనే సామెత మీకు గుర్తుందా..? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అదే తీరు కనిపిస్తోంది. తమవారు అధికారంలో ఉన్నారని ధీమాతో ఇష్టానుసారంగా కొండ భూములను సైతం యధేచ్చగా కబ్జా చేస్తున్నారు! అధికార పార్టీ నేతల అండతో ఏకంగా 700 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విగ్రహం కోసం వందల మంది ఘర్షణ.. అడ్డొచ్చిన పోలీసులపైనా!
    Villagers clash over Shivaji statue: రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంలో 300 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులపై రాళ్లు రువ్విన 34 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వర్క్​ఫ్రమ్​ హోం' క్యాన్సిల్.. 800 మంది ఉద్యోగులు రాజీనామా!
    Whitehat jr work from home jobs: కరోనా కారణంగా వర్క్​ఫ్రమ్​ హోంకు ప్రాధాన్యం పెరిగింది. చాలా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని కల్పించాయి. అయితే, కరోనా అదుపులో ఉండటం వల్ల పలు సంస్థలు ఉద్యోగుల్ని కార్యాలయాలకు పిలుస్తున్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం వర్క్​ఫ్రమ్​ హోంకే మొగ్గుచూపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Ukraine Crisis: క్రెమెన్‌చుక్‌పై విరుచుకుపడ్డ రష్యా!
    Ukraine Crisis: ఉక్రెయిన్​లోని అత్యంత కీలక పారిశ్రామిక నగరం క్రెమెన్‌చుక్‌లోని చమురు శుద్ధి కర్మాగారంపై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. వరుసగా 12 క్షిపణులను ప్రయోగించింది. దీంతో పాటు మేరియుపొల్, డాన్‌బాస్‌లపైనా రష్యా దాడులు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎలాన్​ మస్క్ ట్వీట్.. భారత్​లో 'టెస్లా' కార్ల ప్రయత్నాలకు బ్రేక్​!
    Tesla India Launch: భారత్‌లో టెస్లా కార్ల విక్రయించే ప్రణాళికకు విరామం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దిగుమతి సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జూనియర్​ ప్రపంచకప్‌.. పసిడితో మెరిసిన తెలుగు తేజాలు
    Juniour worldcup Shooting: జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో యువ తెలుగు షూటర్లు ఉమామహేష్‌, ఇషా సింగ్‌ అదరగొట్టారు. పురుషుల టీమ్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో మహేష్‌, మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ఇషా స్వర్ణం సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫుల్​ జోష్​లో సల్మాన్​-వెంకీ.. విజయ్‌-రష్మిక
    సల్మాన్‌ ఖాన్‌ 'కభీ ఈద్‌ కభీ దివాళి' కోసం హీరో వెంకటేశ్​ జూన్‌లో సెట్​లో అడుగు పెట్టనున్నారని తెలిసింది. ఇక తమిళ హీరో విజయ్‌-వంశీ పైడిపల్లి సినిమా సెట్​లో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక తన అనుభవాన్ని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details