- BJP PROTEST: ఆత్మకూరు ఘటనకు నిరసనగా.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భాజపా నిరసనలు
BJP PROTEST: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది. శ్రీకాంత్ రెడ్డిపై దాడికి నిరసనగా ఆందోళన చేపట్టనుంది. దాడిచేసిన వారిని వదిలిపెట్టి తమ నేతలపై కేసులు పెట్టారని భాజపా ఆరోపిస్తోంది.
- National Level Kabaddi: ఘనంగా ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
NATIONAL KABBADI: తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. గెలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని ఒలింపియన్ కరణం మల్లీశ్వరి సహా ప్రముఖులు సూచించారు.
- Tirumala: పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమల
దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో తితిదే భవనాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని గరిష్ట స్థాయిలో తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.
- గజరాజు ఆగ్రహం- 25 మంది ప్రయాణికులున్న బస్సుపై దాడి
ఒడిశా మయూర్భంజ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. బాలాసోర్ నుంచి రాస్గోవింద్పుర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డగించింది. ఆ తర్వాత బస్సును తొండంతో కొద్ది దూరం తోసింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు.. భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరుపులు, కేకలు వేసి హడలిపోయారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు కిటికీ అద్దాలు మాత్రమే ధ్వంసమయ్యాయి.
- మత్తు మాయలో యువత- మాఫియా గుప్పిట్లోకి రాష్ట్రాలు!
మాదక ద్రవ్య మాఫియా గుప్పిట్లోకి పలు రాష్ట్రాలు జారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న మాదకశక్తుల ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో వ్యవస్థాగత వైఫల్యం వల్ల దారుణ దుష్పరిణామాలు పెచ్చరిల్లుతున్నాయి. యువత మత్తుమందుకు బానిసలైతే దేశార్థికానికీ తీరని నష్టం కలుగుతుంది. యావత్ సమాజం మత్తుమందు వ్యసనానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
- చంద్రుడిపై నీటి జాడను కనుగొన్న చాంగే-5
China Moon water: చందమామపై నీటి ఆనవాళ్లను చైనా ల్యాండర్ చాంగే-5 కనుగొంది. జాబిల్లి ఉపరితలంపై ఉంటూ నీటి జాడను పసిగట్టడం ఇదే మొదటిసారి. ఈ ల్యాండర్ ఉన్న ప్రదేశంలో 120 పీపీఎం మేర నీరు ఉన్నట్లు ల్యాండర్ తేల్చింది. తేలికైన, వెసిక్యులర్ శిలలో 180 పీపీఎం మేర జలం జాడ ఉన్నట్లు వెల్లడైంది.
- Cafe coffee day: రూ.వేల కోట్ల అప్పులకు వారసురాలైంది
Café coffee day Malavika Hegde: కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!
- Boxer Lovlina ramp: ర్యాంప్‌పై బాక్సర్ లవ్లీనా
Boxer lovlina ramp walk: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా.. నార్త్ఈస్ట్ ఫెస్టివల్లో భాగంగా వివాహ వస్త్రాల ప్రదర్శన కార్యక్రమంలో సంప్రదాయ అస్సాం చీరతో ర్యాంపుపై తళుక్కున మెరిసింది. ఆ కార్యక్రమంలో ఆమె ధరించిన చీర ఆకర్షణగా నిలిచింది.
- 'రాధేశ్యామ్‌కు పాట రాయడం ఎంతో సంతృప్తినిచ్చింది'
ఆయన రాతలు.. ప్రేమ పాటైలకైనా, బ్రేకప్ పాటలకైనా జీవం పోస్తాయి. ఇటీవల వచ్చిన 'శ్యామ్ సింగరాయ్', విడుదలకు సిద్ధమైన 'రాధేశ్యామ్'తో పాటు పలు సినిమాలకు ఆయన రాసిన పాటలు యువతను ఆకట్టుకున్నాయి. ఆయనే గీత రచయిత కృష్ణకాంత్. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. అవన్నీ ఆయన మాటల్లోనే..