ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - 9AM TOP NEWS

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM

By

Published : Jan 9, 2022, 9:00 AM IST

  • Ghattamaneni Ramesh babu: ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

Ghattamaneni Ramesh babu:ఘట్టమనేని రమేష్ బాబు మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. సీనియర్ నటుడు కృష్ణ కుమారుడైన రమేష్ బాబు... నటునిగా, నిర్మాతగా పని చేశారని గుర్తు చేశారు.

  • పండక్కి ఊరెళ్తున్నారా..? ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Essential Precautions: సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు పయనవుతున్న నగరవాసులకు ఇల్లు గుల్లవుతుందేమోనని భయం పట్టుకుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పట్టపగలే చోరీలు జరుతున్న వార్తలు విని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

  • రైలు పట్టాలపై కూర్చొని పబ్​జీ- అన్నదమ్ములు దుర్మరణం

Siblings Run Over by Train: పబ్​జీ ఆట ఆ సోదరుల ప్రాణాలను తీసింది. రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆడుతూ రైలు కిందపడి చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అల్వార్ జిల్లాలో జరిగింది.

  • ఆసక్తి రేపుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు.. యూపీపైనే అందరి కళ్లు

5 States Election In 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. అయితే ప్రధానంగా ఉత్తర్​ప్రదేశ్​ తీర్పుపైనే అందరి కళ్లు ఉన్నాయి. సాగుచట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • రైలు టికెట్లపై 'అభివృద్ధి' పన్ను భారం.. ఆ స్టేషనల్లో అమలు

Indian Railways New Charges: డెవలప్‌మెంట్‌ ఫీజు (ఎస్‌డీఎఫ్‌)ను ప్రయాణికుల నుంచి వసూలు చేయనునుంది రైల్వే శాఖ. పునరాభివృద్ధి చేసిన స్టేషన్లు అందుబాటులోకి వచ్చాక.. బుకింగ్‌ సమయంలోనే ఈ మొత్తాన్ని టికెట్‌తోపాటు వసూలు చేయనున్నారు. రూ.10 నుంచి రూ.50 మేర ఈ మొత్తం ఉంటుంది.

  • జలపాతం వద్ద విరిగిపడిన కొండచరియలు.. ఏడుగురు మృతి

Cliff Collapse Brazil: బ్రెజిల్‌లోని జలపాతం వద్ద రాతి పెచ్చులు ఊడి మోటర్‌బోటులపై పడిన ఘటనలో ఏడుగురు మరణించగా.. 32 మంది గాయపడ్డారు. మరో 20 అదృశ్యమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • ఒమిక్రాన్‌ వేళ.. అక్కడ ఐదేళ్లలోపు పిల్లల్లో భారీగా ఆసుపత్రి చేరికలు

Corona in USA: గత డిసెంబర్‌ ప్రారంభం నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది.

  • Reliance buys Mandarin Oriental: రిలయన్స్‌ చేతికి న్యూయార్క్‌ హోటల్‌

అమెరికాలోని అత్యంత విలాసవంతమైన ఓ హోటల్‌లో మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సొంతం చేసుకుంది. 'మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌' హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు తెలిపింది.

  • Bopanna Ramkuma Pair: టైటిల్‌ పోరుకు బోపన్న జోడీ

Bopanna Ramkumar Pair: అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో ఫైనల్​కు దూసుకెళ్లింది రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ. ఆదివారం జరిగే టైటిల్‌ సమరంలో టాప్‌సీడ్‌ ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)-మార్సెలో మెలో (బ్రెజిల్‌)తో బోపన్న జంట అమీతుమీ తేల్చుకోనుంది. ఓ ఏటీపీ టోర్నీలో వీరిద్దరూ కలిసి ఆడటం ఇదే తొలిసారి.

  • 'హీరో' అవ్వాలన్నదే నా లక్ష్యం: అశోక్ గల్లా

Ashok Galla Hero movie: మహేష్ ​బాబు 'నాని' సినిమాలో నటించడం వల్ల నటనపై తనకు ఇష్టం పెరిగిందని అన్నారు యువ హీరో అశోక్​ గల్లా. ఆయన నటించిన తొలి చిత్రం 'హీరో' జనవరి 15న విడుదల కానుంది. ఈ మూవీతో ఎన్నో ఏళ్ల తన కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్​గా నటించిన నిధి అగర్వాల్​ తనకెంతో స్వేచ్ఛనిచ్చిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details