ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM

By

Published : Jan 4, 2022, 9:01 AM IST

  • OTS: పేదలిచ్చిన ఓటీఎస్ డబ్బులతో ఇళ్ల చదును!

OTS: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్​టైం సెటిల్​మెంట్ పేరుతో పేదల నుంచి వసూలు చేసిన డబ్బులను జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి అనువుగా మార్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

  • Court Building at Vijayawada: 'విజయవాడలో కోర్టు భవనాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి'

విజయవాడలోని నిర్మిస్తున్న కోర్టు భవనాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలియజేస్తూ అఫిడవిట్‌ వేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. విజయవాడలోని కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది.

  • Pending Bifurcation Issues: 'విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం.. రాజీపడే ప్రసక్తే లేదు'

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, విభజన అంశాలకు సంబంధించి చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ఈనెల 12న కేంద్ర హోంశాఖ సమావేశం నేపథ్యంలో... సీఎస్​కు దిశానిర్దేశం చేసిన సీఎం.. చట్టంలోని అంశాలకు ఏపీ కట్టుబడి ఉంటేనే సహకరించాలని స్పష్టం చేశారు.

  • దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు కరోనా పాజిటివ్​

Arvind kejriwal: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో తనకు పాజిటీవ్‌ వచ్చిందన్నారు.

  • 'తాజ్​మహల్​' సందర్శనపై కొవిడ్​ ఎఫెక్ట్​- టికెట్​ కౌంటర్లు క్లోజ్​!

Taj Mahal ticket counter: కొవిడ్​-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. తాజ్​మహల్​ సందర్శనపై ప్రభావం పడింది. టికెట్​ కౌంటర్లను మూసివేశారు అధికారులు. అయితే, సందర్శకులను అనుమతిస్తున్నట్లు చెప్పారు.

  • కుప్పకూలిన నౌకాదళ హెలికాప్టర్​- ఇద్దరు పైలట్లు మృతి

Navy helicopter crash: ఇజ్రాయెల్​లో నావికాదళ హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించారు.

  • Kim slim: దేశం కోసం తక్కువ తిని స్లిమ్​గా మారిన కిమ్!

Kim slim: ఉత్తరకొరియా నాయకుడు కిమ్​ జాంగ్ ఉన్​ మరింత సన్నగా మారారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఆ దేశ మీడియా విడుదల చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. 'అధినేత ఆరోగ్యంగా ఉన్నారు. దేశం కోసం ఆయన తక్కువగా తింటున్నారు’ అని ఓ మీడియా కథనం పేర్కొంది.

  • SBI-IMPS Limit: ఐఎంపీఎస్‌ లిమిట్‌ పెంచిన ఎస్‌బీఐ.. ఛార్జీలు ఇలా..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ).. ఇమిడియెట్‌ పేమెంట్‌ సర్వీస్​(ఐఎంపీఎస్‌) లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతి లావాదేవీకి రూ.20పైగా జీఎస్​టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

  • పెనాల్టీ షూటౌట్​.. గోల్​కీపర్​ను భలే బోల్తా కొట్టించాడుగా!

FootBall Penalty Shootout: ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​లో భాగంగా పెనాల్టీ షూటౌట్​లో ఓ స్కూల్​ విద్యార్థి.. ప్రత్యర్థి గోల్​కీపర్​ను ఎంతో తెలివిగా బోల్తా కొట్టించి గోల్​ సాధించాడు. దానికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వైరల్​గా మారిన ఆ వీడియోను మీరు చూసేయండి.

  • కీర్తిసురేష్​-స్టాలిన్​ కొత్త సినిమా.. కీలక పాత్రలో ఫహాద్ ఫాజిల్!

Keerthy Suresh Udhayanidhi Movie: వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్​ హీరోయిన్​ కీర్తి సురేశ్​ ఇప్పుడు మరో ప్రాజెక్ట్​కు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్‌ నటిస్తున్నారు. మలయాళ స్టార్​ కీలక పాత్రలో కనిపించనున్నారు

ABOUT THE AUTHOR

...view details