ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - 9AM TOP NEWS

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM

By

Published : Dec 26, 2021, 9:13 AM IST

  • FAKE CURRENCY: నకిలీ నోట్ల చలామణి కేసులో మరో నలుగురి అరెస్ట్

FAKE CURRENCY: గుంటూరు జిల్లాలో నకిలీ నోట్ల చలామణి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శుక్రవారం రాత్రి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... శనివారం రాత్రి మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

  • cpm mahasabhalu: రేపటి నుంచి మూడ్రోజులపాటు సీపీఎం రాష్ట్ర మహాసభలు

రేపటి నుంచి మూడ్రోజుల పాటు సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి సీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

  • OMICRON CASES IN AP : రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు

OMICRON CASES IN AP : రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయింది. 19 వ తేదీ నమునా సేకరించి పరీక్షలకు పంపించగా... ఒమిక్రాన్‌గా తేలింది.

  • Kashmir Encounter: కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం

కశ్మీర్​లో ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాదిని జవాన్లు మట్టుపెట్టారు. అనంతనాగ్​​లోని శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఈ ఎన్​కౌంటర్​ జరిగింది. మృతిచెందిన ఉగ్రవాదిని ఫహీమ్​ భట్​గా అధికారులు గుర్తించారు.

  • omicron news: ఒమిక్రాన్‌పై పదునుతేలాల్సిన వ్యూహం

దేశంలో ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత ప్రభుత్వం 37 ఒమిక్రాన్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాలలను నెలకొల్పి కొత్త వైరస్‌పై పరిశోధనలు చేస్తోంది. ఆ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కొవిడ్‌ కారక కరోనా వైరస్‌లు ప్రధానంగా శ్వాసకోశంపై దాడి చేస్తాయి.

  • Save nature for future: వనరుల పరిరక్షణ ప్రాణావసరం

భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి పాలన విధానాలు, ప్రజల జీవన శైలిలో- ప్రకృతిని పరిరక్షించే దృక్పథం కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరవాత పెరిగిన సాంకేతికత, అభివృద్ధితోపాటు పర్యావరణ సవాళ్లూ పెచ్చుమీరాయి.

  • అధ్యక్షుడిగా బైడెన్ తొలి క్రిస్మస్.. సైనికాధికారులకు వీడియో కాల్

Joe Biden Christmas: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సైన్యంలోని అధికారులు, ఉద్యోగులకు ఫోన్లు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నుముక మీరేనంటూ కొనియాడారు.

  • Why Rupee is falling: రూపాయీ.. ఎందుకు పడుతున్నావ్‌?

Why Rupee is falling: భారత రూపాయి మారకం ఇటీవల భారీగా పడిపోయింది. ఆసియాలో అధికంగా క్షీణించి, అధ్వాన పనితీరుతో కొనసాగుతోంది. అసలు రూపాయి బలహీనతకు కారణాలు ఏంటి? దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • 'ఆత్మవిశ్వాసం ముఖ్యం'.. రహానేకు జహీర్ సలహా

Zaheer advises Rahane: వరుస వైఫల్యాలతో ఇబ్బండి పడుతున్న టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానేకు పలు సూచనలు చేశాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. అతడు గాడిలో పడటానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందని తెలిపాడు.

  • నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్

RRR movie: రాజమౌళి తనకు స్నేహితుడు మాత్రమే కాదు జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని అన్నారు యంగ్​టైగర్​ ఎన్టీఆర్​. కెరీర్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియని సమయంలో, సాధారణంగా ఉన్న తన జీవితాన్ని ఇంతలా మార్చింది ఆయనే అని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details