ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM - 9am top news

ప్రధాన వార్తలు@9AM

9AM TOP NEWS
ప్రధాన వార్తలు@9AM

By

Published : Dec 10, 2021, 9:01 AM IST

  • TTD: తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత..

fms workers arrest: తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 13 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎఫ్​.ఎమ్​.ఎస్ కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

  • ATM THEFT: ఏటీఎం కేంద్రాలలో చోరీ.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

two people arrest: ఏటీఎం మెషినల్లో సాంకేతిక లోపాలను సృష్టించి.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 99 ఏటీఎం కార్డులు, రెండు సెల్​ఫోన్లు, 20వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

  • Lance Naik Sai Teja Death: నేడు స్వగ్రామానికి సాయితేజ మృతదేహం!

హెలికాప్టర్ దుర్ఘటనలో సైనికాధికారి బిపిన్‌ రావత్ తోపాటు అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ మృతదేహం నేడు ఆయన స్వగ్రామానికి చేరుకోనుంది. సాయితేజ గుర్తింపు కోసం ఆర్మీ వైద్యలు తల్లిదండ్రులతో పాటు ఆయన కుమారుడి రక్తనమూనాలకు సేకరించారు.

  • Chopper crash black box: ప్రమాదం గుట్టు విప్పే బ్లాక్‌ బాక్స్‌

సీడీఎస్​ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణానికి కారణమైన ఆర్మీ హెలికాప్టర్ తాలూకు బ్లాక్​ బాక్స్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో ఇది లభ్యమైంది. ప్రమాదానికి కారణాలను నిగ్గు తేల్చడంలో ఇది కీలక పాత్ర పోషించబోతోంది.

  • 'న్యాయవాద వృత్తిని వ్యాపారంగా చూడొద్దు'

న్యాయవాద వృత్తి చాలా గొప్పదని.. విద్యార్థులు వ్యాపారంగా చూడొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. లాభార్జన కోసం ఈ వృత్తిని ఉపయోగించొద్దని హితవు పలికారు. మరోవైపు గదుల్లోనే చిన్నారుల ప్రతిభ ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.

  • భారత్​ను విస్మరించిన అమెరికా- రష్యానే కారణం!

ఊహించిన విధంగానే జీపీఆర్‌లో చైనాపై అగ్రరాజ్యం కన్నెర్ర చేసింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ప్రకటించింది. ఇంతటి కీలక విషయంలో భారత్‌ను అమెరికా విస్మరించడం చర్చనీయాంశమైంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటనే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • ఘోర రోడ్డు ప్రమాదం- 49 మంది దుర్మరణం

Mexico road accident: మెక్సికోలోని చియాపాస్​ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తాపడి పాదచారుల వంతెనను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 49 మంది వలసదారులు మరణించారు. 58 మంది గాయపడ్డారు.

  • Algo trading: రిటైల్‌ మదుపర్ల కోసం అల్గో ట్రేడింగ్‌

స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్‌లో భద్రతను పెంచడం కోసం, అవకతవకలు జరగకుండా చూసేందుకు రిటైల్‌ మదుపర్ల కోసం ప్రత్యేకంగా అల్గారిథమ్‌ ట్రేడింగ్‌(అల్గో ట్రేడింగ్‌)ను తీసుకురావడానికి నిబంధనావళిని సెబీ ప్రతిపాదించింది. ఇంతకీ అల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? దానితో కలిగే ప్రయోజనాలు ఏంటి?

  • Ashes 2021: యాషెస్​లో 'నోబాల్స్' కలకలం

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్​లో నోబాల్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పదే పదే నోబాల్స్‌ వేయడం.. మైదానంలోని అంపైర్‌ వాటిని గుర్తించకపోవడం వివాదాస్పదమవుతోంది.

  • తొమ్మిదిరోజులు నీళ్లు తాగలేదు: హీరో నాగశౌర్య

Naga shourya interview: 'లక్ష్య' విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు హీరో నాగశౌర్య. ఆర్చరీని గుర్తుచేద్దామనే ఈ సినిమా చేశానని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details