- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌తో సీఎం చర్చ.. నేడు మంత్రుల రాజీనామా !
AP New cabinet: వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ఏర్పడిన తొలి కేబినెట్.. చివరి సమావేశం ఇవాళ జరుగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. ప్రమాణ స్వీకారం రోజే మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఈ మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Lands Value Increased: కొత్త జిల్లాల్లో భూముల విలువ.. 75 శాతం వరకు పెంచిన సర్కార్
Lands Values in New Districts: కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. ప్రాంతాన్ని బట్టి దాదాపు 75 శాతం మేర హెచ్చించింది. ఇది కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారనుంది. భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం జమకానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రహదారులపై విగ్రహాల తొలగింపులో వివక్షా ?.. మేం జోక్యం చేసుకునే పరిస్థితి తేవొద్దు'
High Court: రహదారులు, ప్రభుత్వ స్థలాల్లో జాతీయ, రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటు, ఇప్పటికే ఏర్పాటు చేసిన వాటి తొలగింపులో వివక్ష చూపడంపై హైకోర్టు మండిపడింది. ఇందులో మేం జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మా టిడ్కో ఇళ్లు మాకు ఇప్పించండి'.. కేంద్ర మంత్రులకు అమరావతి రైతుల విన్నపం
Amaravathi Farmers Delhi Tour: అమరావతిలో పేదల కోసం అప్పటి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని కేంద్ర మంత్రులకు అమరావతి రైతులు విన్నవించుకున్నారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలని కోరారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో చిచ్చుకు అల్‌ఖైదా యత్నం.. 'హిజాబ్ యువతి'పై ప్రశంసలు
Hijab Issue: హిజాబ్ వివాదంపై మన దేశంలో మతచిచ్చు రాజేసేందుకు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ 'అల్‌ఖైదా' అధినేత అయ్‌మాన్ అల్ జవాహిరీ తాజాగా ప్రయత్నించాడు. హిందూ ప్రజాస్వామ్యమనే ఎండమావిని చూసి ముస్లింలు మోసపోకూడదని వీడియోలో జవాహిరీ పేర్కొన్నాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫుట్‌బాల్ ఆడుతున్న కోడిపుంజు.. సైకిల్‌పై రైడ్లు కూడా!
Cock plays football: ఎక్కడైనా కోళ్లు కోడిపందాలు ఆడటం చూశాం. కానీ ఓ కోడిపుంజు మాత్రం వినూత్నంగా ఫుట్‌బాల్ ఆడుతోంది. మిథున్ అనే 11 ఏళ్ల విదార్థితో సైకిల్ రైడ్‌కి వెళ్తోంది. అది ఎక్కడో చూసేద్దామా మరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రష్యాపై ఆంక్షలు మరింత కఠినం.. పుతిన్ కుమార్తెల ఆస్తులే లక్ష్యంగా
Sanctions On Russia: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా, ఈయూలు సిద్ధమయ్యాయి. పుతిన్ కుమర్తెల ఆస్తులే లక్ష్యంగా ఆంక్షలు విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. రష్యాలోని పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలపై కఠిన ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా, ఈయూ స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టాటా కొత్త కార్ అదుర్స్.. ధరల పెంపుతో మారుతీ షాక్.. 20వేల వాహనాలు రీకాల్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటర్స్ కొత్త విద్యుత్తువాహనాల కాన్సెప్ట్‌ను బుధవారం ఆవిష్కరించింది. మరో తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచనుంది. ఈ ధరలు ఈ నెలలోనే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. కాగా ఈకో మోడల్‌కు చెందిన 20వేల వాహనాలను మారుతీ రీకాల్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వచ్చీ రాగానే విధ్వంసం.. కమిన్స్ రికార్డు 'ఫిఫ్టీ'
Cummins Fastest Fifty: కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ పాట్ కమిన్స్ సునామీలా విరుచుకుపడి.. ముంబయిని ఒంటిచేత్తో ఓడించాడు. 15 బంతుల్లోనే 56 పరుగులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉపేంద్ర దర్శకత్వంలో చిరంజీవి సినిమా..కానీ!
Chiranjeevi Upendra movie: మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని తెలిపారు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉపేంద్ర. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ చిత్రం చేయలేకపోయినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 9 AM