- నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి పరీక్షలు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఇవాల్టి నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల26 వరకు మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అన్యమతస్థులకు శ్రీవారి దర్శనం.. డిక్లరేషన్‌పై దుమారం!
అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన ఆవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనాదిగా వస్తున్న నిబంధనలను పక్కన పెట్టాలని నిర్ణయించడంపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3 రాజధానులు నమ్మకద్రోహమే: పవన్ కల్యాణ్
అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదని.. ఇది ఆంధ్రులందరి సమస్యని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని.. మూడు రాజధానులంటే నమ్మకద్రోహమేనని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు
కరోనా వ్యాప్తి కారణంగా ఇంత కాలం పాఠశాలలు, కాలేజీలను తెరవలేదు. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరచుకోనున్నాయి. సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. 1 నుంచి 8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వివాదాల నడుమ నేడు రాజ్యసభకు వ్యవసాయ బిల్లులు!
విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ఆదివారం కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బిల్లులను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆమోదంపై భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శివసేన.. ముంబయి ఎవరి జాగీరు?