- పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరించి.. పరిహారం వచ్చేలా చూస్తా: సీఎం
CM JAGAN : పోలవరం నిర్వాసితుల కష్టాలు ప్రధాని మోదీకి వివరిస్తానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. విలీన మండలాల్లో పర్యటిస్తున్న జగన్.. ప్రధానితో చెప్పి వీలైనంత త్వరగా పరిహారం వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు. కేంద్రం త్వరగా నిధులిచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏటీఎంలోకి దూసుకెళ్లిన కొత్త కారు.. ఏం జరిగింది..!
CAR: ఓ వ్యక్తి కారు కొన్నాడు... ఇక పూజ చేసి కారు స్టార్ట్ చేశాడు... నెమ్మదిగా బయల్దేరాడు.. కొత్త కారులో వెళ్తున్నామన్న ఆనందమో.. టెన్షనో తెలియదు.. అంతే కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న ఏటీఎంలోకి దూసుకెళ్లింది.. అదృష్టవశాత్తూ ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. శ్రీలంక క్యాసినో ఏజెంట్ల ఇళ్లలో తనిఖీలు
ED Raids in Hyderabad Today : ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ క్యాసినోలు నిర్వహిస్తున్న కొందరి ఇళ్లపై ఈటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక క్యాసినో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో ముందుగా సోదా చేస్తున్నారు. పలు పత్రాలతో పాటు కంప్యూటర్లు, చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పురానాపూల్‌ని ముంచెత్తిన వరదలు.. రాగల మూడు రోజులు భారీ వర్షాలు!
Puranapool: గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు పురానాపూల్‌ని వరదలు ముంచెత్తాయి. భారీగా వరదనీరు చేరడంతో రెండు ఆలయాలు జలదిగ్బంధమయ్యాయి. ఆహర కొరతతో పురానాపూల్, జియాగూడ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బంగాల్‌లోనూ 'ఆపరేషన్ శిందే!'.. భాజపాతో టచ్‌లో 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు!
బంగాల్ రాజకీయం కీలక మలుపు తిరగనుందా? మహారాష్ట్ర తరహా పరిణామాలకు వేదిక కానుందా? ఔననే అంటున్నారు నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తి. టీఎంసీ మాత్రం ఆయన వాదనల్ని కొట్టిపారేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇకపై 50% ఫ్లైట్లనే నడపాలి'.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్
ఇకపై 8 వారాల పాటు స్పైట్‌జెట్ సంస్థ 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. ఇటీవల తరచూ స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో వాటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లాక్డౌన్లో బోర్ కొట్టి విమానం తయార్.. ఫ్యామిలీతో ప్రపంచమంతా టూర్!
పైలట్ లైసెన్స్ కలిగిన అశోక్ గతంలో టూ సీటర్ విమానాలను అద్దెకు తీసుకొని అందులో విహారయాత్రలు చేసేవాడు. వివాహం, అనంతరం ఇద్దరు కుమార్తెలు కలగడంతో ఆయనకు నాలుగు సీట్ల విమానం అవసరమయ్యింది. ఈ విమానాలు అద్దెకు అరుదుగా లభిస్తుండటం, అవీ పాతవి కావడంతో తానే ఓ ఫోర్ సీటర్ విమానాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఇందుకు లాక్‌డౌన్ కాలం కలిసొచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం
నష్టాల ఊబిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ను ఆదుకునేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సంస్థ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 4జీ సేవల విస్తరణ కోసం స్పెక్ట్రమ్ కేటాయించనున్నట్లు తెలిపింది. మరోవైపు, రెండోరోజు 5జీ వేలంలో రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా దాదా ఎంపిక ఖరారైనట్లేనా?
ICC New Chairman Ganguly: ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా బోర్డు స్పందించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బింబిసార' కొత్త ట్రైలర్.. కల్యాణ్ రామ్ అదరగొట్టేశాడుగా
Kalyan Ram Bimbisara new trailer: నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' కొత్త ట్రైలర్ వచ్చేసింది. యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 7 PM