రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ను పరీక్షించగా, 7,943మంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 16,93,085 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 19,845మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,28,360కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,53,795 యాక్టివ్ కేసులున్నాయి.
Corona Cases in AP: కొత్తగా 7,943 కేసులు, 98 మరణాలు - corona death toll in andhrapradesh
ap corona cases
16:43 May 31
AP Corona Cases
గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ చిత్తూరులో అత్యధికంగా 15మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 10,930కి చేరింది.
ఇదీ చదవండి
Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Last Updated : May 31, 2021, 5:15 PM IST