AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 6,996 మందికి వైరస్ సోకగా.. నలుగురు మృతి చెందారు. కొత్తగా కరోనా నుంచి 1066 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 38,055 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారిగా కేసులు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,534 కరోనా కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళం జిల్లాలో 573, అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 మందికి కొవిడ్ సోకింది.
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు.. 2,38,018 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 310 మంది మరణించారు. 1,57,421 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.03 శాతం నమోదైందని పేర్కొంది. అయితే.. యాక్టివ్ కేసుల సంఖ్య కొత్తగా 80,287 పెరగడం ఆందోళన చెందాల్సిన అంశమని వెల్లడించింది.
మొత్తం కేసులు:3,76,18,271
మొత్తం మరణాలు:4,86,761
యాక్టివ్ కేసులు:17,36,628
మొత్తం కోలుకున్నవారు:3,53,94,882