ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. తుళ్లూరు మండలం ఐనవోలు దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన బుద్దుడి విగ్రహాన్ని తెనాలి శ్రావణ్ కుమార్, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రారంభించారు. అనంతరం రైతులతో కలిసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అమరావతి భూములను అమ్మకాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెనాలి శ్రావణ్ కుమార్ చెప్పారు.
433వ రోజూ కొనసాగిన రాజధాని రైతుల దీక్షలు - అమరావతి రైతుల ధర్నా వార్తలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 433వ రోజూ కూడా కొనసాగాయి.
433వ రోజూ కొనసాగిన అమరావతి ఉద్యమం
ప్రభుత్వం రాజకీయకక్షతోనే పాలిస్తోందని రాజధాని ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ఆరోపించారు. బుద్ధుడి స్ఫూర్తితో ఉద్యమాన్ని శాంతియుతంగానే కొనసాగిస్తామన్నారు. మిగిలిన రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు 433వ రోజూ కూడా దీక్షలను కొనసాగించారు. పెదపరిమి, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు, మహిళలు నిరాహార దీక్షలు చేశారు.
ఇదీ చదవండి:బరువు 900 గ్రాములు.. ధర రూ. 800.. !