హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో ఇవాళ 42 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంబర్ పేట్ డివిజన్ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, నల్లకుంట డివిజన్ పరిధిలో 10, కాచిగూడ డివిజన్ పరిధిలో 12, గోల్నాక డివిజన్ పరిధిలో 4, బాగ్ అంబర్ పేట్ డివిజన్ పరిధిలో 1 కేసు నమోదైంది.
హైదరాబాద్ అంబర్‌పేటలో 42 కరోనా కేసులు
హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఒక్కరోజే 42 మందికి వైరస్ సోకింది. వైద్యులను, పోలీసులను ఈ మహమ్మారి వదలడం లేదు.
-amberpet-constituency-hyderabad
కాచిగూడలో ఓ డాక్టర్‌తో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్ధరణ అయింది. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌తో పాటు పోలీస్ క్వార్టర్స్‌లో మరో ఇద్దరికి వైరస్ సోకింది.