హైదరాబాద్ ప్రగతినగర్‌లో జరిగిన నవదంపతుల ఘటన(husband murdered wife) ప్రభావం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీపై పడింది. సుమారు 300 మంది ఆందోళనతో కాలనీ దద్దరిల్లిపోతోంది. వాళ్లను కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట, ఇళ్లపై రాళ్ల దాడితో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెళ్లైన నెల రోజులకే భార్యపై అనుమానంతో గొంతు కోసి హత్య(husband murdered wife) చేసిన ఘటన పరిణామంలో భాగమే పైన చెప్పిన ఉద్రిక్తత. నిందితుడు కిరణ్ ఇళ్లు... కామారెడ్డిలోని శ్రీరాంనగర్‌లో ఉంటుంది. విషయం తెలియగానే.. సుధారాణి సొంత గ్రామామైన తిమ్మాపూర్‌కు చెందిన సుమారు 300 మంది గ్రామస్థులు, బంధువులంతా.. పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చేరుకున్నారు. కాలనిలో ఉన్న కిరణ్ ఇంటిముందు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
గ్రామస్థుల ఆగ్రహాన్ని కట్టడి చేయలేక..
అమ్మాయి తరఫు బంధువులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కామారెడ్డికి చేరుకున్నారన్న విషయం తెలియగానే.. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. "మాకు న్యాయం కావాలి" అంటూ నిందితుని ఇంటి గేటుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఉన్న కూతురును చూసుకుంటూ.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో గారాబంగా పెంచిన కూతురుని తలుచుకుంటూ.. ఆ అమ్మానాన్నలు గుండెలు బాదుకుంటున్న దృశ్యం.. ఆ గ్రామస్థులు, బంధువుల ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. కోపంతో ఊగిపోతూ.. ఇంటి గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో గ్రామస్థులు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను బయటకు లాగేశారు. కొందరు మహిళలు రాళ్లతో ఇంటిపై దాడి చేశారు. ఈ పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనుమానమే పెనుభూతమై..