ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Jun 25, 2022, 12:57 PM IST

  • హత్యకేసులో సాక్షులను బెదిరిస్తున్నారు.. డీజీపీకి చంద్రబాబు లేఖ
    CBN LETTER TO DGP: కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారని.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. హత్యకేసులో కీలక సాక్షి అయిన సతీష్​ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని.. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NOTICE: ధూళిపాళ్ల మెమోరియల్ ట్రస్ట్​కు మళ్లీ నోటీసులు..
    NOTICE: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవాదాయ శాఖ నోటీసులిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అభివృద్ధి లేదన్న గిరిజనులు.. చంద్రబాబుపై దాడి చేయాలన్న వైకాపా ఎమ్మెల్యే!
    GADAPA GADAPA: "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లిన.. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలుగు వాడిగా ఉండటాన్ని గర్విస్తున్నా: జస్టిస్ ఎన్వీ రమణ
    CJI Justice NV Ramana: అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. ఇవాళ న్యూజెర్సీలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నట్లు.. ఈ సందర్భంగా పేర్కొన్నారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'శివుడు కంఠంలో విషాన్ని దాచుకున్నట్లు మోదీ ఆ బాధను భరించారు'
    Amit shah on gujarat riots 2002: గుజరాత్​ అల్లర్లపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకున్నట్లుగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 19 ఏళ్లుగా తనలోనే బాధను దాచుకున్నారని అన్నారు. మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడం శుభపరిణామం అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వీపర్​కు హ్యాట్సాఫ్​.. దొరికిన వజ్రాలను యజమానికి అందజేత.. వాటి విలువ ఎంతంటే?
    ఓ స్వీపర్​ నిజాయతీతో అందరి మనసు గెలుచుకున్నాడు. తను పని చేసే ఫ్యాక్టరీలో ఊడుస్తున్న సమయంలో వజ్రాల ప్యాకెట్లు దొరకగా.. వాటిని తను తీసుకోకుండా.. యజమానికి అందజేసి శభాష్​ అనిపించుకుంటున్నారు. ఇంతకీ అతనెవరు? ఆ వజ్రాల విలువెంత? మరోవైపు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ కూలీని అదృష్టం రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ముంబయి పేలుళ్ల సూత్రధారికి 15 ఏళ్ల జైలు శిక్ష
    నిషేధిత ఉగ్రవాద సంస్థ చెందిన సాజిద్​ మజీద్​కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్థాన్ కోర్టు. 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి అయిన మజీద్​కు శిక్షతో పాటు రూ.4 లక్షల జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫారం-16 అందుకున్నారా?.. అయితే ఈ వివరాలు సరిచూసుకోండి
    ఉద్యోగుల ఆదాయపు పన్ను లెక్క తేల్చడంలో ఫారం 16 ఎంతో కీలకమైన పత్రం. యాజమాన్యం తన ఉద్యోగి ఆర్జించిన ఆదాయం, పొందిన మినహాయింపులు, చెల్లించిన పన్నుకు సంబంధించిన టీడీఎస్‌ వివరాలన్నింటితో దీనిని జారీ చేస్తుంది. ఇప్పటికే సంస్థలు ఈ పత్రాన్ని ఉద్యోగులకు అందించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇందులో వేటిని సరిచూసుకోవాలో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీ, రోహిత్ ఇద్దరే ఉన్నారు.. ఆ పని మళ్లీ చేస్తారా?
    విదేశాల్లో టీమ్​ఇండియా టెస్టు సిరీస్​లు ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యం. ఇంగ్లాండ్​ గడ్డపై గత ఏడేళ్లలో జరిగిన 14 టెస్టుల్లో కేవలం నాలుగు మాత్రమే భారత్ గెలిచింది. నలుగురు బ్యాటర్లు శతకాలు చేసి.. ఆ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. వారిలో ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే ప్రస్తుతం జట్టులో ఉన్నారు. ఈ ఇద్దరు మరోసారి అలాంటి మేటి ఇన్నింగ్స్​ ఆడతారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలీవుడ్ ఆపసోపాలు.. 'బారణా' సినిమాలు..'చారణా' కలెక్షన్లు.. ఇందుకేనా?
    మన దేశంలో 'పెద్ద సినిమా' అంటే హిందీ సినిమానే. అక్కడి నటీనటులే ఇండియన్‌ సినిమా స్టార్లు. ఖాన్‌ త్రయం, కపూర్ ఫ్యామిలీ, యాక్షన్‌ హీరోలు అక్షయ్‌, అజయ్‌... వీళ్లే అగ్రతారలు. అయితే ఇదంతా గతం. గత పదేళ్లలో భారతీయ చిత్రపరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు దక్షిణాది చిత్రాలు/ కథల హవా ఇండియన్‌ సినిమాను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్నాయి. అదే సమయంలో బాలీవుడ్‌ వసూళ్ల వేటలో వెనుకబడింది. దీనికి కారణమేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details